చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో వైభవంగా దేవి శరన్నవరాత్రులు
బాల త్రిపుర సుందరి దేవి ఆకాంకరణతో భక్తులకు దర్శనభాగ్యం కలిగించిన అమ్మవారు
ఒంగోలు: చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలోనుండి శ్రీ దేవి శర న్న వరాత్రుల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభం అయ్యాయి.మాజీమంత్రి శిద్దా రాఘవరావు దంపతులు శ్రీ హరిహర క్షేత్రంలో వేంచేసి ఉన్న సకల దేవతలకు విశేష పూజలు నిర్వహించారు.అనంతరం శ్రీ దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు అందుకున్నారు.
ఉదయం శ్రీ వాసవి అమ్మవారికి పాంచామృత సుగంధ ద్రవ్యాల అభిషేకాలు నిర్వహించి తదుపరి అమ్మవారికి శ్రీ చక్రార్చన సాయంత్రం ఉభయదాతల చే కుంకుమ అర్చన,అర్యవైశ్య మహిళలచే సామూహిక శ్రీ లలితా సహస్ర నామ సోస్త్రం,పారాయణం,నైవేద్యం,హారతి,తీర్థప్రసాదాల వినియోగం జరిగింది అని ఆలయ అర్చకులు తెలిపారు.సోమవారం రెండవ రోజూ శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శన భాగ్యం కలిగిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. దేవి శరన్నవరాత్రుల పునస్కారించుకొని శ్రీ హరిహర క్షేత్రం విద్యుత్ దీపాలతో అలంకరణతో క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.అమ్మవారి దర్శనం కోసం మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.శిద్దా వెంకటేశ్వర్లు,శ్రీమతి వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అల్పాహారం ఏర్పాటు చేశారు.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.