జిల్లా కారాగారంను సందర్శించిన ఎపి జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా
ముద్దాయిల బ్యారక్ లు, జైలు హాస్పిటల్ తదితర ప్రదేశాల పరిశీలన
ఒంగోలు: జైలు అంతర్గత భద్రతపై, ఖైదీలలో పరివర్తన కోసం తీసుకోవలసిన చర్యలపై జైలు అధికారులకు సూచనలు జారీ జిల్లా కారాగారము యొక్క భద్రత దృష్ట్యా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, కరెక్షనల్ సర్వీసెస్, ఆంధ్రప్రదేశ్ హరీష్ కుమార్ గుప్తా, గుంటూరు రేంజ్ కారాగార ఉపశాఖాధికారి డా॥ యం.వరప్రసాద్, ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ ఒంగోలులోని జిల్లా జైలును సందర్శించారు.
జిల్లా కారాగారం ఆవరణములను, ముద్దాయిల బ్యారక్ లను, జైలు హాస్పిటల్ తదితర అన్ని ప్రదేశాలను తిరిగి పరిశీలించారు. అక్కడ ఉన్న ఖైదీలతో మాట్లాడి వారి యొక్క నేర వివరాలు,స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. జైలులో వారికి కల్పిస్తున్న మౌళిక వసతులు, సమస్యలు, ఉచిత న్యాయసహాయం గురించి ఆరా తీశారు.
అంతర్గత భద్రతపై జైలు అధికారులతో మాట్లాడి ఖైదీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, భద్రత లోపాలు లేకుండా చూసుకోవాలని, ఎలాంటి భద్రతా సమస్య ఉన్నా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొనిరావాలని సూచించారు. జైలు అంతర్గత భద్రతపై, ఖైదీలలో పరివర్తన కోసం తీసుకోవలసిన మంచి చర్యలపై జైలు అధికారులకు పలు సూచనలు తెలియచేసినారు.
అనంతరం జిల్లా కారాగారంలో ముద్దాయిలు కొరకు ఏర్పాటు చేసిన ఆసుపత్రి, మహిళా ఖైదీల బ్లాక్ లు పాత భవనములు అయినందున వాటికి సంబంధించిన మరమ్మత్తులు, పునర్నిర్మాణ పనుల గురించి, తగిన వసతులు ఏర్పాటుపై జైలు అధికారులతో చర్చించడం జరిగినది. వారి వెంట జైలు సూపరింటెండెంట్ పి. వరుణా రెడ్డి, డిస్ట్రిక్ట్ సబ్ జైలు ఆఫీసర్ వెంకట రెడ్డి, డియస్బి డియస్పి బి.మరియాదాసు, ఒంగోలు డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, ఒంగోలు టు టౌన్ సిఐ జగదీశ్, కారాగార వైద్యాధికారి డా॥యస్.వి.యస్.బ్రహ్మతేజ, జైలర్ వి.రమేష్ తదితరులు ఉన్నారు.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.