వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను - సంచలన నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యే అన్నా

On
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను - సంచలన నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యే అన్నా

ప్రకాశం: గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. మార్కాపురం లోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తనకు గిద్దలూరు సిటు ఇస్తామని జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, తాను గెలవగలనని అయినా, అనారోగ్య కారణాల వల్ల ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని వివరించారు. తనకు ఇన్ని సంవత్సరాలుగా అండగా ఉన్న గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అని అన్నారు. వైకాపా లోనే ఉంటానని, అధిష్టానం ఎవరికి సీటు ఇచ్చిన మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో కొందరు నాయకుల మూలంగా అవమానాలు ఎదుర్కొన్నానని, జిల్లా పెద్దలకు చెప్పినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకత్వం కూడా సరిగా స్పందించక పోవడం విచారకరమని అన్నారు. 

మాగుంట కుటుంబాన్ని ఎందుకు ఆదరించాలి?
ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ని టార్గెట్ చేస్తూ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 సంవత్సరాల నుంచి మాగుంట కుటుంబాన్ని మన జిల్లా వాసులు ఆదరించారని,వారి కుటుంబం ఈ జిల్లా అభివృద్ధికి ఏమైనా తోడ్పడిందా అని ప్రశ్నించారు. మాగుంట ను ఆదరించడం ఇక బావ్యం కాదన్నారు. మొత్తం మీద గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు నిర్ణయం జిల్లా లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.మరి అధిష్టానం ఎలాంటి అడుగులు వేస్తుందో వేచి చూడాల్సిందే.

IMG20231227152840

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

నేటి పంచాంగం:  *బుధవారం, మే 21, 2025* నేటి పంచాంగం:  *బుధవారం, మే 21, 2025*
*శ్రీ గురుభ్యోనమః*  *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*      *ఉత్తరాయనం - వసంత ఋతువు*    *వైశాఖ మాసం - బహుళ పక్షం*   తిథి      : *నవమి* రా10.38 వరకు.వారం...
నేటి పంచాంగం:   *మంగళవారం, మే 20, 2025*
నేటి పంచాంగం:  *సోమవారం, మే 19, 2025*
బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్ ఇచ్చిన భారత్
ప్రధాని మోదీతో లోకేష్ భేటీ
నేటి పంచాంగం: *ఆదివారం, మే 18, 2025*
టీటీడీ వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు