పొత్తులతో కాదు ప్రజా అభిమానంతో గెలుస్తాం

ఏపీఐఐసి చైర్మన్, జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జంకె

On
పొత్తులతో కాదు ప్రజా అభిమానంతో గెలుస్తాం

Markapur: రాష్ట్రంలో ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకొని వచ్చిన వైఎస్ఆర్సిపిదే విజయం అని ఏపీఐఐసి చైర్మన్, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు  జంకె వెంకటరెడ్డి అన్నారు. మార్కాపురం మండలంలోని బొడిచర్ల గ్రామ పంచాయతీలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాభిమానమే గెలుస్తుంది కానీ పొత్తులు గెలవవన్నారు. చంద్రబాబు, పవన్ లకు గెలిచే దమ్ము లేక పొత్తులు పెట్టుకుంటున్నారని విమర్శించారు. మీకు మేలు జరిగితే ఓటు వేయండని అడిగే దమ్మున్న  ప్రజా నాయకుడు  జగన్మోహన్ రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలను, కార్పోరేట్ పాఠశాలలకు  దీటుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనన్నారు. పేద పిల్లలు సైతం తన పిల్లలతో సమానంగా కార్పోరేట్ విద్య అందించాలని జగన్ కోరుకుంటే చంద్రబాబు పిల్లలను మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించి పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు లేకుండా చేస్తున్నారు అని అన్నారు.

రేపు జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబుని,పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల కొండయ్య, సర్పంచి మున్నంగి కోటేశ్వరి,ఎంపీటీసీ లక్ష్మి దేవి, కో-ఆప్షన్ మెంబర్ రఫీ, నాయకులు పోరెడ్డి చెంచిరెడ్డి, పంబి వెంకటరెడ్డి రమణారెడ్డి, జంకె కృష్ణారెడ్డి, భవనం బ్రదర్స్, జెసిస్ కోఆర్డినేటర్  శ్రీనివాస రెడ్డి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

IMG-20240314-WA0012

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

ఘోర రోడ్డు ప్రమాదం ఘోర రోడ్డు ప్రమాదం
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోగా ఈ సంఘటన లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద లారీ, కారు ఢీకొన్నాయి....
తండ్రి చేతిలో కొడుకు హతం...
నేటి పంచాంగం:  *శుక్రవారం, మే 23, 2025*
డియల్డివో గా బాధ్యతలు స్వీకరించిన బాలూ నాయక్ 
Video: ఆర్కే బీచ్ రోడ్  ఆన్ మూల్ విల్లాలో  శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం నమూనా  ప్రారంభం
ఏసీబీ వలలో మిషన్ భగీరథ ఏఈ
ఆర్టీసీ బస్సు బీభత్సం