నవరత్నాల తో గెలవచ్చుగా... ప్యాకేజీలు ఎందుకు?
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల
అగ్ని న్యూస్,మార్కాపురం: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏదోలా అధికారం నిలబెట్టుకునేందుకు తాపత్రయపడుతుందని ఎన్డీఏ పక్షాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో జనసేన, బీజేపీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కందుల మాట్లాడుతూ నవరత్నల పథకాలు ప్రజలకు నచ్చి ఉంటే,మీ పార్టీ అధికారంలోకి వస్తుంది కదా..మరి ఎందుకు ప్యాకేజీలు ఇస్తూ, నాయకులను కొనుగోలు చేస్తున్నారు అని ప్రశ్నించారు.చేసింది ఏమిలేక పోవడంతో, వైకాపా అన్ని ప్రయత్నాలు ముమ్మరం చేసి, గెలవడం కోసమే పరితపిస్తుందని ఆరోపించారు. మా మూడు పార్టీలు కలిసి మెలిసి పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు.మా పార్టీ లు వాలంటీర్ వ్యవస్థ కు వ్యతిరేకం కాదని అయితే కొన్ని సవరణలు అవసరం అని అన్నారు.జనసేన మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి ఇమ్మడి కాశీనాధ్ మాట్లాడుతూ తప్పుడు హామీల ద్వారా వైకాపా అధికారంలోకి రావాలని కలలు కంటుందన్నారు.వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే ఎలా జాతికి అంకితం చేస్తారని నిలదీశారు. బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి పివి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ఎన్డీఏ తోనే సాధ్యం అని, వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. ఇది మాటల ప్రభుత్వం అని, వైకాపా పాలనను విమర్శించారు. జలకళ పథకం లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన దోపిడికి పాల్పడిందని ఆరోపించారు. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి సత్యనారాయణ, మౌలాలి,నాలి కొండయ్య,బీజేపీ నాయకులు బొంతల కృష్ణ, పైడిమర్రి రామచంద్ర,రాజ శ్రీకాంత్,జనసేన నాయకులు సాధిక్, సురేష్, కాశీ రాంసింగ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.