మేలు జరిగి ఉంటేనే ఓటేయండి
వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నా రాంబాబు
పొదిలి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చారని, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించారని, అందుకే ఫ్యాను గుర్తుపై ఓటు వేసి మరోసారి వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మద్దతు నివ్వాలని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. బుధవారం పొదిలి మండలంలోని అన్నవరం,చింతగుంపల్లి,ఆముదాలపల్లి, నిమ్మవరం,సల్లోడివారిపాలెం, తీగదుర్తిపాడు, రాములవీడు,ఏలూరు,నల్లరెడ్డిపాలెం,పూనుగువారిపాలెం, టి.సల్లూరు, ఉప్పలపాడు, గోగినేనివారిపాలెం, తళమల, తూరిపాలెం గ్రామాల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా ఆయా గ్రామాల్లోని ప్రతి గడపకు వెళ్లి జగనన్న పాలనలో అందించిన మంచిని వివరించి కరపత్రాలను అందచేశారు. అనంతరం ప్రజలను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్న మీ అన్నా రాంబాబును, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ, వలంటీర్ వ్యవస్థలను ఏర్పాటు చేసి సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికీ చేర్చిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. చంద్రబాబు దొంగ హామీలతో మళ్లీ ఎన్నికలకు వస్తున్నారని వారి మాయమాటలకు మోసపోవద్దని ఎమ్మెల్యే అన్నా హితువు పలికారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తి జగనన్న అని, మరోసారి ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో మరింత సంక్షేమం, అభివృద్ది జరుగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో అందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మార్కాపురం నియోజకవర్గం ఎలా అభివృద్ది చేయాలో ప్రణాళిక ఉందని ప్రజలు ఆశీర్వదిస్తే అవి చేసి చూపిస్తానన్నారు. ఏదో ఒక నెపంతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్న టీడీపీ నాయకులను ప్రజలు నమ్మవద్దన్నారు. రాష్ట్రంలో ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా చివరకు విజయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా అన్నారు. గెలిచే దమ్ములేక పొత్తులు పెట్టుకుంటున్నారని విమర్శించారు. మీకు మేలు జరిగితే ఓటు వేయండని అడిగే దమ్మున్న నాయకుడు జగనన్న అన్నారు. తెల్లవారు జామునే పింఛన్ అందాలన్నా....పిల్లల చదువులు సక్రమంగా సాగాలన్న...ఖరీదైన వైద్యం పేదలకు ఉచితంగా అందాలన్నా.... ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి గెలిపించాలన్నారు. ప్రతి పంచాయతీ పరిధిలో గ్రామసచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ లను కట్టించి గ్రామంలోనే పాలన అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం పలువురు నాయకులు బైక్ ర్యాలీగా అన్నా కు స్వాగతం పలికారు. ముందుగా ఆయా గ్రామాల్లోని పలువురు వైసీపీ నాయకులు, వైసీపీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, ఎమ్మెల్యే అన్నాను గజమాలతో ఘనంగా సన్మానించి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమం లో పలువురు వైసీపీ ముఖ్య నాయకులు,వైసీపీ ప్రజా ప్రతినిధులు,వైసీపీ కుటుంబ సభ్యులు,పొదిలి మండలం, టౌన్ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.