Category
State
State 

బాపట్లలో విచిత్రమైన ఘటన .. కారు ఉన్నా రోడ్డేశారు..!

బాపట్లలో విచిత్రమైన ఘటన .. కారు ఉన్నా రోడ్డేశారు..! బాపట్ల: ఇంటి ముందు పార్క్ చేసిన కారుని అలాగే ఉంచేసి కాంక్రీట్ రోడ్డు వేసేసిన కాంట్రాక్టర్.బాపట్ల జిల్లా దేశాయిపట్నం లో కొత్తగా సిమెంట్ రోడ్డు వేస్తున్న సందర్భంలో రోడ్డు పక్కనే కారు ఉంది.ఆ వాహనం తీయాలని ఎన్నిసార్లు చెప్పినా సరే తీయకుండా కారు తాళం వేసి వెళ్లిపోయాడని అధికారులు తెలిపారు. కారు తీయడానికి తాళం లేకపోవడంతో కారుని అలాగే ఉంచి సిమెంట్ రోడ్డు నిర్మాణం చేశామంటున్న  కాంట్రాక్టర్.
Read More...
State 

ఘనంగా  ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు జన్మదిన వేడుకలు

ఘనంగా  ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు జన్మదిన వేడుకలు పల్నాటి జిల్లా : నర్సరావుపేట  శాసన సభ్యులు డాక్టర్ అరవింద బాబు పుట్టిన రోజు వేడుకలు మంగళవారం రాత్రి  భువన చంద్ర టౌన్ హాల్ లో ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా పార్టీ పరిశీలకులు శాసనాల వీరబ్రహ్మం ఈ కార్యక్రమానికి హాజరై డాక్టర్ అరవింద బాబు కు శాలువ కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అలాగే టీడీపీ నాయకులు శాసనాల వీరబ్రహ్మం కు శాలువ కప్పి సన్మానించారు. టౌన్ హాల్ కమిటీ అధ్యక్షులు జవ్వాజి వెంకట రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గొనుగుంట్ల కోటేశ్వరరావు, ఏపి రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాల క్రిష్ణ,ఎన్ డి ఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
Read More...
Local  State 

ఈనెల 16 న ‌కనిగిరి లో శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు 

ఈనెల 16 న ‌కనిగిరి లో శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు  ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుండడం పట్ల వైశ్య సంఘాల హర్షం ఇది తెలుగు వారందరి కార్యక్రమం.. వక్కలగడ్డ మల్లికార్జున 
Read More...
State 

ఒంటిమిట్ట శ్రీ సీతారామ లక్ష్మణులకు స్వర్ణ కిరీటాలు అందచేసిన పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్ రెడ్డి 

ఒంటిమిట్ట శ్రీ సీతారామ లక్ష్మణులకు స్వర్ణ కిరీటాలు అందచేసిన పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్ రెడ్డి  కడప : ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయానికి సుమారు రూ.6.60 కోట్ల విలువైన మూడు వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాలను పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం అందజేశారు.దాదాపు 7 కేజీల బంగారంతో తయారు చేసిన ఈ స్వర్ణ కిరీటాలను ఆలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్.నాయుడు, ఈవో శ్యామలరావులకు దాత అందించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈ కిరీటాలను శ్రీసీతారామ లక్ష్మణుల మూల మూర్తులకు అలంకరించారు.
Read More...
State 

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి అలర్ట్..

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి అలర్ట్.. విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్‌కార్డులు ఉన్నవారిని అలర్ట్ చేసింది.. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులో పేరు ఉండి, ఈకేవైసీ చేయించుకోని వారు ఈ నెల 30లోగా ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్, ఎండీయూ వాహనంలో ఈ పోస్‌ మెషిన్ అందుబాటులో ఉంటుంది. అందులో లబ్ధిదారుల రేషన్‌కార్డు వివరాలు నమోదు చేస్తే చాలు.. కుటుంబసభ్యుల వివరాలు ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ పోస్ మెషిన్‌లో ఎర్ర రంగు బాక్స్‌లో పేర్లు ఉంటే ఈకేవైసీ పెండింగ్‌లో ఉన్నట్లుగా గుర్తించాల్సి ఉంటుంది. ఒకవేళ గ్రీన్ కలర్‌ (ఆకుపచ్చ రంగు)లో ఉంటే వారి ఈకేవైసీ పూర్తయినట్లే లెక్క. అప్పుడు వారు రెడ్ కలర్ (ఎర్ర రంగు) గడిలో పేరు ఉన్న వారు వేలిముద్ర వేస్తే చాలు ఈకేవైసీ పూర్తవుతుంది. ఒకవేళ లబ్ధిదారులు ఈకేవైసీ వివరాలు తెలుసుకోవాలంటే.. వెంటనే గూగుల్‌ వెబ్‌ బ్రౌజర్‌లో ఈ పి డి ఎస్1 అని నమోదు చేసి ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. 'డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ కన్సూమర్‌ ఎఫైర్స్, ఫుడ్‌ అండ్‌ సివిల్‌ సప్లయిస్, ఏపీ' అనే సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది.. 'రేషన్‌ కార్డు సెక్షన్‌లో 6 రకాల ఆప్షన్లు ‘న్యూ’ అనే పేరుతో ఉంటి."EPDS APPLICATION SEARCH", "RICE CARD SEARCH" రెండు ఆప్షన్లలో ఒకదానిపై క్లిక్ చేసి.. రేషన్ కార్డు నంబర్ నమోదు చేయగానే అందులో ఉన్న వారి పేర్లు వస్తాయి. ఈ పేర్ల ఎదురుగా సక్సెస్‌ లేదా ఎస్‌ అని ఉంటే వారి ఈకేవైసీ పూర్తి చేసినట్లే. అలా లేకుండా ఇంకేమైనా ఉంటే ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. డీలర్‌/రేషన్‌ బండి దగ్గర ఈ పోస్‌ యంత్రంలో వేలిముద్ర వేసి ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ కేవైసీ పూర్తి చేసుకోవడానికి ఈ నెల 30 డెడ్‌లైన్‌గా విధించారు. ఐదేళ్లలోపు వారికి, 80 సంవత్సరాలు పైబడిన వారికి ఈకేవైసీ అవసరం లేదు.. మిగిలిన అందరూ ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సిందే' అని అధికారులు కోరుతున్నారు.
Read More...
State 

వడ్డీరేట్లను తగ్గించిన RBI

వడ్డీరేట్లను తగ్గించిన RBI RBI వరుసగా రెండోసారి రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి దిగొచ్చింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ కీలక వడ్డీ రేట్లను కేంద్ర బ్యాంకు 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే.
Read More...
State 

మార్క్ శంకర్ కు వైద్య పరీక్షలు చేస్తున్నారు: పవన్ కళ్యాణ్ 

మార్క్ శంకర్ కు వైద్య పరీక్షలు చేస్తున్నారు: పవన్ కళ్యాణ్  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి సింగపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళిన పవన్ కల్యాణ్  నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. మార్క్ ను చూశారు. చేతులు, కాళ్ళకు కాలిన గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. అక్కడి వైద్యులు, అధికారులతో మాట్లాడారు. మార్క్ కోలుకొంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని తెలియచేశారు. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చారు. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియచేశారు.
Read More...
State 

జగన్ వేనా .. పైలట్ వి ప్రాణాలు కావా? : అనిత

జగన్ వేనా .. పైలట్ వి ప్రాణాలు కావా? : అనిత AP: మాజీ సీఎం జగన్ కావాలనే హెలికాప్టర్లో ప్రయాణించలేదని, సాంకేతిక సమస్య ఉంటే పైలట్ ఎలా వెళ్లారని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. జగన్ వేనా ప్రాణాలు.. పైలట్ వి కావా అని ఆమె నిలదీశారు. 'వైసీపీ నేతలు కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజులు పెట్టుకున్నారు. జగన్ స్థాయికి తగ్గట్లు భద్రత ఏర్పాటు చేశాం' అని ఆమె పేర్కొన్నారు.
Read More...
State 

ఏపీలో 80 వేల కోట్లతో రిఫైనరీ  - కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి

ఏపీలో 80 వేల కోట్లతో రిఫైనరీ    - కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి           (అగ్ని ప్రతినిధి, న్యూఢిల్లీ)పెట్రోలియం రంగంలో అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు వస్తున్నాయనీ.. అవకాశాలు వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. ఏపీలో రూ.80 వేల కోట్లతో రిఫైనరీ రాబోతోందని వెల్లడించారు. గతంలో 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే వాళ్లమని, ఇప్పుడు 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అని అన్నారు.ముడి చమురు ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేసి.. ఎక్కువ నిల్వ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఒక్కో బ్యారల్ ముడి చమురు 60 డాలర్ల వరకు ఉంది అని కేంద్ర మంత్రి తెలిపారు.
Read More...
State 

మంత్రి గొట్టిపాటి ని కలిసిన ఎమ్మెల్యే డా.చదలవాడ

మంత్రి గొట్టిపాటి ని కలిసిన ఎమ్మెల్యే డా.చదలవాడ నరసరావుపేట :  నియోజకవర్గ శాసనసభ్యులు డా. చదలవాడ అరవింద బాబు, విద్యుత్ శాఖ మంత్రి పల్నాడు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ ను తాడేపల్లిలో వారి క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నరసరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి మరియు పలు సమస్యలపై చర్చించారు. సమస్యల పై వినతి పత్రాలను అందించారు. సమస్యలు త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, మంత్రిని కోరారు. వారితో టీడీపీ సీనియర్ నాయకులు పులిమి రామిరెడ్డి, పోత్తూరి ప్రసాద్ తదితరులున్నారు.
Read More...
State 

ఏపీలో అణు జలాంతర్గామి స్థావరం

ఏపీలో అణు జలాంతర్గామి స్థావరం అనకాపల్లి : ఏపీలో సముద్ర రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా మరో కీలక ముందడుగు పడనుంది. తూర్పు తీరంలో రక్షణ అవసరాల కోసం నిర్మిస్తున్న నేవీ ప్రత్యామ్నాయ స్థావరం 'INS వర్ష'ను 2026లో ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. విశాఖపట్నానికి 50 కి.మీ. దూరాన అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లిలో సముద్ర తీరాన్ని ఆనుకొని దీన్ని నిర్మిస్తున్నారు. హిందూ సముద్ర ప్రాంతంలో చైనా చర్యలపై నిఘాకు ఈ స్థావరం ఉపయోగపడుతుంది.
Read More...
State 

ఏసీబీకి చిక్కిన  చంద్రగిరి పంచాయతీ ఈవో  మహేశ్వరయ్య ఇంటిపై మళ్లీ ఏసీబీ దాడులు

ఏసీబీకి చిక్కిన  చంద్రగిరి పంచాయతీ ఈవో  మహేశ్వరయ్య ఇంటిపై మళ్లీ ఏసీబీ దాడులు తిరుపతి: * తిరుపతి రూరల్ (మం) పేరూరు జర్నలిస్టు కాలనీలో ఏసిబి అధికారులు సోదాలు. * ఏకదంత అపార్ట్మెంట్ లో చంద్రగిరి పంచాయతీ ఈవో మహేశ్వరయ్య అక్రమ ఆస్తుల పై సోదాలు * గతంలో లంచం తీసుకుంటూ ఏసిబి ట్రాప్ కు చిక్కిన ఈఓ మహేశ్వరయ్య * లంచం కేసులో సస్పెండ్ అయిన ఈఓ మహేశ్వరయ్య *మళ్లీ అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ రైడ్స్* * ఆయన ఉంటున్న అపార్ట్మెంట్ లో కొనసాగుతున్న సోదాలు  * మార్కెట్ విలువ ప్రకారం రూ.30 కోట్లు అక్రమ ఆస్తుల కూడబెట్టినట్లు అంచనా..... * పూర్తి వివరాలు  వెల్లడించనున్న ఏసీబీ అధికారులు................
Read More...