పట్టణ ఓటర్ల పైనే టిడిపి ఆశలు
గ్రామీణ ప్రాంతంలో చెరిసగమంటూ లెక్కలు
(అగ్ని ప్రతినిధి, మార్కాపురం)
మార్కాపురం నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకు మలుపు తిరుగుతున్నాయి. పోటీ రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నట్లుగా భావిస్తున్నారు. మండలాల వారీగా ఎవరికి ఎక్కడ ఎక్కువ ఓట్లు ఉన్నాయని లెక్కలతో జనాలు తిప్పలు పడుతున్నారు. టిడిపి నాయకుల అంచనాలు చూస్తే పొదిలి, కొనకనమిట్ల మండలాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాస్త మెజార్టీ ఓట్లు వస్తాయని, తర్లుపాడు ,మార్కాపురం మండలాల్లో టిడిపికి మెజార్టీ ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. ఈ నాలుగు మండలాల్లో పోరు సమానంగా ఉంటుందని వారి లెక్క. కొనకనమిట్ల, పొదిలి మండలాల్లో వైసిపి కి వచ్చే మెజార్టీ ని, తర్లుపాడు, మార్కాపురం మండలాల్లో మాకు వచ్చే మెజారిటీతో సమానం అవుతామని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.దీంతో పట్టణ ఓటర్ల పైనే టిడిపి ఆశలు పెట్టుకున్నట్లుగా భావించాలి. నాలుగు మండలాల్లో ఇరువురు సమానం అయితే, మార్కాపురం పట్టణం లో వచ్చే మెజార్టీ తో గెలుస్తాం అనే ధీమాతో టీడీపీ నాయకులు ఉన్నారు. మార్కాపురం పట్టణంలో 2009 ఎన్నికల్లో టీడీపీ కి ఏకంగా 8 వేల మెజారిటీ వచ్చింది. 2014 ఎన్నికల్లో ఆ మెజార్టీ 3 వేలకు దిగింది. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ కేవలం 1500 ఓట్లతో సరిపెట్టుకుంది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో టీడీపీ ఏకంగా 5 వేల నుంచి 10 వేల వరకు మెజారిటీ వస్తుంది అని టీడీపీ కీలక నేతలు భావిస్తున్నారు. పట్టణంలో 2009 నాటి పరిణామాలు తిరిగి మరోసారి పునరావృతం అయితేనే టీడీపీ కి అవకాశాలు మెండుగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి అన్నా రాంబాబు అభ్యర్థి కావడం తో టీడీపీ లెక్కలు తప్పుతాయని విశ్లేషకులు అంచనాలు కడుతున్నారు. మరి ఓటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి మరి!.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.