Category
Local
Cultural  Local 

హనుమంతుని వాహన సేవలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా కుటుంబం

హనుమంతుని వాహన సేవలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా కుటుంబం మార్కాపురం: మార్కాపురం ఇల వేల్పు శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం ఉదయం హనుమంతుని వాహన సేవ నిర్వహించారు. ఈ సేవ లో గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం వైఎస్సార్సీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు ధర్మపత్ని దుర్గా కుమారి , తనయుడు అన్నా కృష్ణ చైతన్య  ధర్మపత్ని  అనూష, కుమార్తె సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
Read More...
Cultural  Local 

పొన్న వాహనం పై విహరించిన చెన్నకేశవ స్వామి 

పొన్న వాహనం పై విహరించిన చెన్నకేశవ స్వామి  మార్కాపురం: పట్టణంలోని  శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారు పొన్న వాహనంపై నుంచి మురళీ కృష్ణుని అలంకరణ లో భక్తులను అనుగ్రహించారు. పొన్న వృక్షమంటే కల్పవృక్షమని అర్థం.కల్పవృక్షం పై నుంచి స్వామివారిని దర్శించుకొని భక్తులు తరించారు. సకల కోరికలను తీర్చు కల్పవృక్షం శక్తి సామర్థ్యాలను భగవానుడు అనుగ్రహించడం పొన్నవాహనసేవలో అనుగ్రహించడం ఎంతో ప్రీతికరమైందని,ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు తెలిపారు. ఉభయదారులు గా వేముల సుబ్బారావు దంపతులు,వేముల ప్రసాద్ దంపతులు వ్యవహరించారు. కార్యక్రమాలు కమిటీ అధ్యక్షులు యక్కలి కాశీ విశ్వనాధం, సభ్యులు ఆలంపల్లి శ్రీనివాస్, బొంతల సుధీర్,ఈఓ గొలమారు శ్రీనివాసరెడ్డి ల పర్యవేక్షణ లో జరిగాయి.
Read More...
Local 

వక్కలగడ్డ నాయకత్వంలో కనిగిరి కి తరలి వెళ్ళిన ఆర్యవైశ్యులు

వక్కలగడ్డ నాయకత్వంలో కనిగిరి కి తరలి వెళ్ళిన ఆర్యవైశ్యులు మార్కాపురం: ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసువులు బాసిన స్వర్గీయ పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మార్కాపురం ఆర్యవైశ్య నాయకులు, వక్కలగడ్డ మల్లికార్జున నేతృత్వంలో బుధవారం కనిగిరి కి బయలుదేరి వెళ్లారు. ముందుగా పట్టణంలోని అమ్మవారి శాలలో వాసవి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, పొట్టి శ్రీరాములు గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు వాహనాల్లో కనిగిరి కి బయలుదేరి వెళ్లారు. కనిగిరి లో నేడు ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వర్గీయ పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం నాయకులు తాళ్ళపల్లి సత్యనారాయణ, ఆలంపల్లి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
Read More...
Local 

ఐటిడిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

ఐటిడిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి మార్కాపురం: ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డవెలిప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మార్కాపురం మండలం, బి.పి.నాగులవరం చెంచుగూడెం లో సంస్థ కార్యదర్శి అనుముల రవికుమార్ అధ్యక్షతన డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా చెంచు గిరిజనులకు లడ్లు,మిఠాయిలు పంచిపెట్టారు,ఈ కార్యక్రమంలో కృష్ణ కుమారి మరియు చెంచు పెద్దలు పాల్గొని భారత దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు.
Read More...
Local 

పుర్రె తో క్షుద్ర పూజలు.. భయాందోళన లో ప్రజలు

పుర్రె తో క్షుద్ర పూజలు.. భయాందోళన లో ప్రజలు ప్రకాశం జిల్లా:  గిద్దలూరు మండలం కొండపేట సమీపంలో సోమవారం క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు నిమ్మకాయలు, ముగ్గు, పసుపు కుంకుమతో పాటు మనిషి పుర్రెను పెట్టి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షుద్ర పూజలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read More...
Local  State 

ఈనెల 16 న ‌కనిగిరి లో శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు 

ఈనెల 16 న ‌కనిగిరి లో శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు  ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుండడం పట్ల వైశ్య సంఘాల హర్షం ఇది తెలుగు వారందరి కార్యక్రమం.. వక్కలగడ్డ మల్లికార్జున 
Read More...
Local 

ఒకే వేదిక పైన మాజీ ఎమ్మెల్యే... ఎమ్మెల్యే

ఒకే వేదిక పైన మాజీ ఎమ్మెల్యే... ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా : రాచర్ల మండలం జెపి చెరువు సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం కావడంతో భక్తులు 20వేల మందికి పైగా తరలివచ్చారు. ఒకే వేదికపై కళ్యాణ మహోత్సవంలో ప్రస్తుత ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు ప్రజలకు కనిపించారు. స్వామివారికి ఇరువురు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇది చూసిన జనం సంతోషంగా మురిసిపోయారు.
Read More...
Local 

వెలిగొండ శ్రీ వెంకటేశ్వర గౌడ సత్రం అధ్యక్షులు గా దొంతా కృష్ణ గౌడ్ 

వెలిగొండ శ్రీ వెంకటేశ్వర గౌడ సత్రం అధ్యక్షులు గా దొంతా కృష్ణ గౌడ్  మార్కాపురం: కొనకనమిట్ల మండలం లోని గార్లదిన్నె ఇలాఖా లోని వెలిగొండ శ్రీ వెంకటేశ్వర స్వామి గౌడ అన్న సత్రం నందు ఆదివారం సమావేశం నిర్వహించారు. ప్రస్తుత అధ్యక్షులు కంచర్ల నడిపి వెంకటేశ్వర్లు గౌడ్, పెద్దలు ఇల్లూరి రంగస్వామి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం లో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏకగ్రీవంగా దొంతా కృష్ణ గౌడ్ ని నూతన అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు కంచర్ల కాశయ్య గౌడ్ మాట్లాడుతూ నూతన కమిటీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత కమిటీ కంటే కూడా నూతన కమిటీ వారు సత్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ సందర్భంగా పెద్దలు మరో గౌరవాధ్యక్షులు కీర్తి సాయన్న గౌడ్  మాట్లాడుతూ మన గౌడ సత్రానికి త్వరలో భారీ భోజన శాల నిర్మించాలని, దానికి కావాల్సిన వనరులు  సమకూర్చడంలో  నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. కమిటీకి ప్రధాన కార్యదర్శిగా  దోసపాటి వెంకటేశ్వర్లు గౌడ్ , కోశాధికారిగా అలగాని కృష్ణయ్య గౌడ్, ఉపాధ్యక్షులు దోసపాటి బ్రహ్మం గౌడ్ ( వేములపాడు), గోరా రంగయ్య గౌడ్ (ముప్పాళ్ళపాడు), కంచర్ల శ్రీనివాస్ గౌడ్ (రాయవరం), దొంత హరి గౌడ్ , ముద్దర్స్ వెంకటేశ్వర్లు గౌడ్ ( ఖాజీపురం), జాయింట్ సెక్రటరీగా  - గజ్జ అంకయ్య గౌడ్ సోదరులు (కంభం), దోసపాటి వెంకట్ నర్సయ్య గౌడ్ ( గాజులపల్లె),  రావుల బాల గురయ్య గౌడ్ (చినమనగుండం), మల్లాల ఎల్లయ్య గౌడ్ ( కనిగిరి),    కార్యవర్గ సభ్యులు గాదోసపాటి వెంకట్ నర్సయ్య గౌడ్ (చినదాసరి పల్లె), మల్లాల నరసబాబు గౌడ్ ( కనిగిరి), గోరా చెన్నకేశవులు గౌడ్ (కనిగిరి),పంది శ్రీనివాసులు గౌడ్ గుంటూరు జిల్లా, మల్లాల వెంకటేశ్వర్లు గౌడ్ (నల్లపాడు), కానాల నరసింహ గౌడ్( పెదారికట్ల), కంచర్ల నాసరయ్య గౌడ్ (కలగట్ల), రావుల చెన్నకేశవులు గౌడ్ (చినమనగుండం), దొంత తిరుపతయ్య గౌడ్ (రాయవరం), తుళ్లూరి యాలాద్రి గౌడ్ (గముల్లపాలెం)లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాన కార్యదర్శి దోసపాడు బాల గురయ్య గౌడ్ , కోశాధికారి దొంత పెద్ద అంకయ్య గౌడ్, మార్కాపురం గౌడ సంఘ గౌరవ సలహాదారులు బత్తిని శ్రీనివాస రావు గౌడ్, పెద్దలు కొమర వెంకటేశ్వర్లు గౌడ్, కొమర వెంకట నరసింహారావు గౌడ్, జూపల్లి హనుమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read More...
Cultural  Local 

కమనీయం శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణం

కమనీయం శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణం మార్కాపురం: పట్టణం లోని శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి‌. ఆదివారం తెలతెలవారుతుండగ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి పండితులు హయగ్రీవచార్యుల వ్యాఖ్యానం, సోమయాజుల మల్లికార్జున శాస్త్రి మంత్రోచ్ఛారణ నడుమ కళ్యాణం కమనీయం గా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు కళ్యాణ కైంకర్యాలను శాస్త్రం బద్ధంగా నిర్వహించారు.ఈ కళ్యాణంలో మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి దంపతులు, మార్కాపురం నియోజకవర్గ వైఎస్ ఆర్ సి పి ఇంచార్జి, గిద్దలూరు మాజీ శాసనసభ్యులు  అన్నా వెంకట రాంబాబు దంపతులు, మునిసిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాల మురళి కృష్ణ దంపతులు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ లు యక్కలి కాశీ విశ్వనాధం, పెనుగొండ కేశవరావు, సభ్యులు వక్కలగడ్డ మల్లికార్జున, ఆలంపల్లి శ్రీనివాస్, ప్రదీప్, రమేష్, ఈఓ గొలమారు శ్రీనివాసరెడ్డి,పట్టణ ప్రముఖులు,వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సీఐ సుబ్బారావు నేతృత్వంలో ఎ‌స్ఐ లు సైదు బాబు, రాజమోహన్,ఎఎస్ఐ లు, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read More...
Local 

ఉచిత చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే అన్నా

ఉచిత చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే అన్నా మార్కాపురం:  పట్ట ణంలోని కోర్టు సెంటర్లో గ్లోబల్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, వైఎస్ఆర్సిపి మైనార్టీ నాయకులు డాక్టర్ షంషీర్ అలీబేగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ సిపి మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నా వెంకట రాంబాబు తో పాటు వైఎస్ఆర్సిపి ఇంటిలెక్చువల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు మేడా బదరీనాథ్, పియల్పీ యాదవ్,వైస్ చైర్మన్ ఇస్మాయిల్, అంజమ్మ శ్రీనివాస్,కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
Read More...
Local 

సి.ఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ యశ్వంత్ ని కలిసిన బీజేపీ నేత కృష్ణారావు 

సి.ఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ యశ్వంత్ ని కలిసిన బీజేపీ నేత కృష్ణారావు  మార్కాపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ప్రధాన భద్రత అధికారి తంగిరాల యశ్వంత్ ని మార్కాపురం లోని ఆయన స్వగృహంలో శనివారం బిజెపి మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి పివి కృష్ణారావు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కృష్ణారావు, యశ్వంత్ తో మాట్లాడుతూ మార్కాపురం ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషిచేసేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం,మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని కొనసాగించడం వంటి కీలకమైన పనులు పెండింగ్లో ఉన్నందున వీటిపై చంద్రబాబు నాయుడు కి సానుకూలమైన దృక్పథం కలిగించేలా మీరు దృష్టిపెట్టి ఈ ప్రాంత ప్రజానీకాన్ని ఆదుకోవాలని కృష్ణారావు, యశ్వంత్ ని కోరారు.
Read More...
Local 

త్రిపురాంతకం లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్న సబ్ కలెక్టర్ 

త్రిపురాంతకం లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్న సబ్ కలెక్టర్  మార్కాపురం:  డివిజన్‌లో రేషన్ బియ్యం అక్రమాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో త్రిపురాంతకం మండలంలో ఓ రేషన్ డీలర్ పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో ఆ డీలర్ 200కు పైగా బస్తాల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది. దీనితో సంబంధించి స్థానిక ఎమ్మార్వోకు ఆ డీలర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ, “పేదలకు అందాల్సిన రేషన్ బియ్యంలో ఎటువంటి అక్రమాలు జరగకుండా చూస్తాం. ఎవరు అయినా అక్రమంగా వ్యాపారం చేస్తే, ఎంతటి వారైనా సరే వదలకుండా కఠిన చర్యలు తీసుకుంటాం,” అని హెచ్చరించారు. అక్రమ రేషన్ వ్యాపారంపై కఠిన వైఖరితో అధికారులు ముందుకు వెళ్లడం స్థానిక ప్రజల్లో విశ్వాసం పెంచుతోంది.
Read More...