సిపిఆర్ చేసి పిల్లవాడిని కాపాడిన వైద్యురాలు
శభాష్ రవళి అంటూ ప్రశంసలు
విజయవాడ: విజయవాడలో ఓ వైద్యురాలు సమయస్పూర్తితో వ్యవహరించి ఓ బాలుని నిండు ప్రాణాన్ని కాపాడింది. ఆమె ప్రతిభను, సేవను రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఆ వైద్యురాలి పేరే డాక్టర్ నన్నపనేని రవళి. విజయవాడ అయ్యప్ప నగర్ కు చెందిన ఆరేళ్ల బాలుడు సాయి(6) శనివారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో.. తల్లిదండ్రులు ఏడుస్తూ పిల్లాడిని భుజంపై పెట్టుకుని ఆసుపత్రికి వెళ్లేందుకు పరుగులు పెడుతున్నారు. మెడ్సి ఆసుపత్రిలో ప్రసూతి వైద్య నిపుణురాలైన నన్నపనేని రవళి అదే సమయంలో అటుగా వస్తూ, వారిని గమనించారు. ఏమైందని ఆమె అడగటంతో తల్లిదండ్రులు విషయం చెప్పారు. ఉలుకూ పలుకూ లేకుండా ఉండటంతో రోడ్డు మీదే బాలుడికి సిపిఆర్ చేసి, ప్రాణాలు కాపాడింది. వృత్తి ధర్మం పై అత్యంత బాధ్యతను కలిగిన వైద్యురాలి కృషి ఫలించడంతో ఆ బాలుడు మళ్లీ ఊపిరి తీసుకున్నాడు. విజయవాడలో చోటుచేసుకున్న ఈ ఆసక్తికర ఘటన వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వైద్యురాలిగా మంచి బీజీగా ఉండే రవళి, బాలుని పరిస్థితిని గమనించి తన కెందుకులే అనుకోకుండా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించింది. బాలుడిని పరీక్షించి అక్కడే రోడ్డుపైనే పడుకోబెట్టమని చెప్పారు. అనంతరం కార్డియో పల్మోనరీ రిససిటేషన్(సీపీఆర్) చేయ డం ప్రారంభించారు. ఒకవైపు డాక్టర్ రవళి బాలుడి ఛాతిపై చేతితో ఒత్తుతూ.. అక్కడున్న మరో వ్యక్తిని నోటితో గాలి ఊదమని సూచించారు. దాదాపు ఏడు నిమిషాటు ఈ ప్రక్రియ సాగింది. బాలుడి స్పృహలోకి వచ్చాడు. వెంటనే బాలుడిని దగ్గరలో ఉన్న ఓ
ప్రైవేటు అసుపత్రికి ద్విచక్రవాహనంపై తీసు కెళ్లారు. ఆసుపత్రికి వేళ్లే మార్గంలోనూ బాలుడికి శ్వాస సరిగ్గా అందేలా.. తలను కొద్దిగా కిందకి ఉంచి పడుకోబెట్టి తీసుకెళ్లమని సూచించారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత చికిత్స ఆరంభించగా పూర్తిగా కోలుకున్నాడు. 24గంటలు పరీక్షించి అనంతరం సీటీ స్కాన్ చేస్తే ఎలాంటి సమస్య లేదని గుర్తించి ఇంటికి పంపించారు. బాలుడి ప్రాణాలు కాపాడిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ వైద్యురాలిని అందరూ మెచ్చుకుంటున్నారు.
మరో విషయం గుండెపరంగా తగిన చలనం లేని స్థితిలో ఇచ్చే సీపీఆర్ చికిత్స ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు, వైద్యరంగానికే కాకుండా యువతీ, యువకులకు ప్రభుత్వం సీపీఆర్‌పై ఉచితంగా చికిత్సను అందించి దృవీకరణ పత్రం ఇస్తుంది.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.