సహజవనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

On
సహజవనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

అమరావతి: గత ఐదేళ్లలో సహజ వనరులు దోపిడీ చేశారు,గత ప్రభుత్వం అడవులను కూడా ధ్వంసం చేసింది అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారు - కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీ చేశారు - విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూకబ్జాలకు పాల్పడ్డారు - ఇళ్ల నిర్మాణం పేరుతో వైసీపీ నేతలు దందా చేశారు - 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు అని అన్నారు.వైసీపీ నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ భూములు అప్పగించారు - ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూ దోపిడీకి కుట్ర పన్నారు - రామానాయుడు స్టూడియో భూములు కొట్టేసేందుకు విఫలయత్నం - వృద్ధాశ్రమానికి ఇచ్చిన హయగ్రీవ ల్యాండ్స్‌ను కూడా కొట్టేశారు - దస్పల్లా భూములను కొట్టేసి ఇళ్లు కట్టారు అని అన్నారు. మాజీ ఎంపీ ఎంవీవీ అనేక భూఅక్రమాలకు పాల్పడ్డారు - ఒంగోలులో నకిలీ పత్రాలతో రూ.101 కోట్లల ఆస్తి కాజేసేందుకు యత్నం - ఒంగోలు భూకబ్జాలపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాం అని తెలిపారు. తిరుపతి, రేణిగుంటలోని మఠం భూములను కొట్టేశారు - తిరుపతి జిల్లాలో భూఅక్రమాలకు లెక్కే లేదు - 22-ఏ పెట్టి భూఅక్రమాలు చేశారు - చిత్తూరులో 782 ఎకరాలు కాజేసేందుకు ప్రయత్నించారు అని, హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చర్యలు చేపట్టా అని అన్నారు.హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చర్యలు చేపట్టా - పుంగనూరులో 982 ఎకరాలను పట్టా చేయించుకున్నారు - పేదవారి అసైన్డ్ భూములను వైసీపీ నేతలు లాక్కున్నారు - హౌసింగ్ కాలనీ ఎక్కడ రావాలో వైసీపీ నేతలే నిర్ణయించేవారు - ముందే స్థలం కొనేవారు.. అనేక రెట్ల పరిహారం కొట్టేసేవారు.. - గ్రామాల్లో ఉండే ఖాళీ భూములను ఆక్రమించారు - నివాసయోగ్యం కాని ఆవ భూములను కేటాయించారు - అక్రమంగా భవనాలు కట్టేశారు అని చంద్రబాబు అన్నారు.

ప్రశ్నించే వారిపై దాడులు చేశారు - 13,800 ఎకరాలను వైసీపీ నేతలకు ధారాదత్తం చేశారు - తక్కువ ధరకు 40 వేల ఎకరాలు కొన్నారు - అధికారులను బెదిరించి భూములకు పట్టాలు తెచ్చుకునేవారు - భూహక్కు పత్రం పేరుతో ప్రచారానికి రూ.13 కోట్లు ఖర్చు చేశారు - భూముల రీసర్వే పేరుతో జగన్ చిత్రం ముద్రించుకున్నారు - ల్యాండ్ టైటిలింగ్ చట్టం మేరకు ప్రైవేట్ వ్యక్తులను నియమించవచ్చు - ఎంతో అహంభావంతో ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చారు - ల్యాండ్ టైటిలింగ్ చట్టం దురుద్దేశాలను ప్రజలు గ్రహించారు - ఒకసారి భూములను చెక్ చేసుకోవాలని ప్రజలను కోరుతున్నా - భవిష్యత్తులో భూకబ్జా చేయాలంటే భయపడేలా చేస్తాం - భూములు, ఆస్తులు కబ్జాకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి అని సూచించారు.
గుజరాత్‌లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఇక్కడా తెస్తాం - తాము భూమి యాజమానులని కబ్జాదారులే నిరూపించుకోవాలి - మైనింగ్, క్వారీ లీజుల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారు - బెదిరింపులు, భారీ జరిమానాలతో అనేక గనులు కొల్లగొట్టారు - గనుల కేటాయింపులో పారదర్శకత తీసుకువస్తాం - పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి గనులు తవ్వేశారు - గనుల కేటాయింపులో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ నిబంధనలకు తూట్లు - ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలను తెచ్చారు - అధికారులను డిప్యుటేషన్‌పై తెచ్చుకుని అక్రమాలకు పాల్పడ్డారు - ఇసుక తవ్వకాల్లో అక్రమంగా భారీ యంత్రాలు వాడారు - ఇసుక తవ్వకాల కోసం నదులు, కాలువలపై రోడ్లు వేశారు - ఇసుక దందాను ప్రశ్నించే వారిపై అట్రాసిటీ కేసులు పెట్టారు - కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో భారీ ఇసుక దందాలు - వైసీపీ నేతలకు కప్పం కట్టలేక అనేకమంది ఆత్మహత్య చేసుకున్నారు - ఇసుక దందాలో రూ.9,750 కోట్ల కొట్టేశారు - అటవీ, గనులశాఖను సాధారణంగా ఒక వ్యక్తికి ఇవ్వరు - వైసీపీ హయాంలో అటవీ, గనుల శాఖ, ఒకే వ్యక్తికి అప్పగించారు అని, తూ.గో.జిల్లాలో లేటరైట్ గనులను బలవంతంగా లాక్కున్నారు అని అన్నారు. ప్రకాశం జిల్లాలో 250 క్వారీలపై దాడులు చేశారు - చిత్తూరు జిల్లాలో టార్గెటెడ్ ఇన్‌స్పెక్షన్ల పేరుతో వేధించారు - కుప్పం నియోజకవర్గంలోనే అక్రమంగా గనులు తవ్వేశారు - దౌర్జన్యం, బెదిరింపులు, జరిమానాల పేరతో గనుల దోపిడీ -  పల్నాడు జిల్లాలో ఇష్టానుసారం అటవీసంపద కాజేశారు - చారిత్రక ప్రాంతాల్లోనూ అడవులు కొట్టేశారు.
రుషికొండలో రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టారు - రుషికొండ కట్టడాలు.. ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినియోగం చేయడమే - భీమిలి ఎర్రమట్టి దిబ్బలను పూర్తిగా మింగేశారు - ఆఖరికి ద్రవిడ యూనివర్సిటీలో అక్రమంగా మైనింగ్ చేశారు - నెల్లూరు జిల్లాలో క్వార్జ్ ఖనిజాన్ని ఇష్టానుసారం దోపిడీ చేశారు - పర్యావరణాన్ని దెబ్బతీస్తే భావితరాలు దెబ్బతింటాయి - ప్రకృతి సంపద ప్రజలకు చెందాలి - గనుల బాధితులు ముందుకు రావాలి.. ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి - అమరావతి రోడ్డుపై ఉన్న మట్టిని తవ్వుకుని పోయారు - ఎర్రచందనం దొంగరవాణా కోసం అక్రమాలకు పాల్పడ్డారు.ఎర్రచందనాన్ని దొంగరవాణా చేసి చైనాకు పంపారు - ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని తగ్గించారు - వైసీపీ నేతలు.. ఎర్రచందనం స్మగ్లర్లను ప్రోత్సహించారు - స్మగ్లర్లను ప్రోత్సహించడం సమాజానికి చాలా ప్రమాదం - ప్రభుత్వ, ప్రైవేట్ భూముల పరిరక్షణకు ప్రజలంతా కలిసి రావాలి - భూగర్భ ఖనిజ సంపద సమాజహితానికి వినియోగించాలి - వైసీపీ బాధిత గనులు, క్రషర్ల యజమానులు ముందుకు రావాలి - అడవులు మింగేసిన అనకొండలను శిక్షిస్తాం - తిరుపతి జిల్లాలోని కొండలపై ఔషధ మొక్కలు పెంచాం అని అన్నారు.
విశాఖ కొండలపై వివిధరకాల పూలమొక్కలు ఉండాలనేది నా కల - గనుల దోపిడీ కోసం అధికారులను బెదిరించారు.. బదిలీలు చేశారు. వైసీపీ నేతల దోపిడీకి కొందరు అధికారులు సహకరించారు - భూకబ్జాలు, గనులు, అటవీసంపదను దోచిన వారిని శిక్షిస్తాం.ఎర్రచందనం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం - నేరస్థులు, దోపిడీదారులను వదిలిపెట్టం.. కఠినంగా శిక్షిస్తాం.టీడీఆర్ బాండ్లు, రేషన్ బియ్యంలోనూ అక్రమాలకు పాల్పడ్డారు - దొంగకు తాళాలిచ్చి దోచుకునేలా ప్రోత్సహించారు -

అవినీతిపరులు ఎంత పెద్దవారైనా వదిలేది లేదు

 భోగాపురం విమానాశ్రయ భూములు లాక్కున్న వారిపై చర్యలు - భూకబ్జాలపై టోల్‌ఫ్రీ నెంబరు ద్వారా ఫిర్యాదు తీసుకుంటాం - భూముల రీసర్వే పేరుతో నష్టపోయిన వారికి న్యాయం చేస్తాం - దోపిడీ చేసిన మొత్తాన్ని సాధ్యమైనంత త్వరగా వసూలు చేస్తాం అని అన్నారు.

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

అష్టాదశ శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలు
*!!లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే!!**!!ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే!!**!!అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా!!**!!కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా!!**!!ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా!!**!!ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే!!**!!హరిక్షేత్రే కామరూపా,...
నేటి పంచాంగం:     *శుక్రవారం, జూన్ 20, 2025*
రోడ్ ప్రమాదం లో ముగ్గురికి తీవ్ర గాయాలు
అంగన్వాడీల్లో ఫేషియల్ రికగ్నిషన్
వైసీపీ సైకోల ఫ్యాక్ట‌రీ: లోకేష్
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం: జ‌గ‌న్‌
అక్రమ అరెస్టులు కాదు....సంక్షేమ పథకాలు అమలు చేయండి