సామర్లకోట లో జగన్ రెడ్డి అసత్య ప్రసంగం

టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు

On
సామర్లకోట లో జగన్ రెడ్డి అసత్య ప్రసంగం

మంగళగిరి: ముఖ్యమంత్రి సామర్లకోటలో చేసిన అసత్యాల ప్రసంగం... దాన్ని ప్రజలతో నమ్మించే ప్రయత్నం చేసేందుకు బహిరంగ సభల పేరిట ఏకంగా ప్రజలసొమ్మునే దుర్వినియోగం చేస్తున్న తీరుని తీవ్రంగా తప్పుపడుతున్నామని, జగన్ రెడ్డి చెప్పిన ఊళ్లు ఎక్కడున్నాయో ఆయన వచ్చి చూపిస్తాడో..లేక మంత్రులు చూపిస్తారో చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు , మాజీ మంత్రి నక్కాఆనంద్ బాబు నిలదీశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమయం, సందర్భంతో పనిలేకుండా అబద్ధాలు చెప్పడమే ముఖ్యమంత్రి పనిగా పెట్టుకున్నాడు. నిజం అనేది తన నోటినుంచి వస్తే తన జీవితం తలకిందులవు తుందనే భయం జగన్ లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చెప్పిన జగనన్న కాలనీల (ఊళ్లు) మాటున వైసీపీ నేతలు వేలకోట్లు కొట్టేశారు. ముఖ్యమంత్రి పేదలకు 30లక్షల ఇళ్ల పట్టాలిచ్చానంటున్నాడు. ఒక్కో ఇంటిస్థలం రూ.12లక్షల విలువచేస్తుం దని చెబుతున్న ముఖ్యమంత్రికి ఎకరాకు ఎన్ని సెంట్లు ఉంటాయో తెలుసునా? ఒక ఎకరం కొని లే అవుట్లు వేసి పేదలకు పంచితే, దానిలో దాదాపు 35 నుంచి 40సెంట్ల భూమి పోతుంది. మిగిలిన 65 సెంట్ల భూమిని ఒక్కొక్కరికీ సెంటుచొప్పున పంచితే, దాని విలువ రూ.65లక్షలు ఉంటుంది. కానీ సెంటు రూ.12లక్షలు ఎలా అవుతుందో ముఖ్యమంత్రే చెప్పాలి. కేవలం ఇళ్ల నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వ వాటాగానే రూ.2.70ల క్షలు ఇస్తున్నట్టు కూడా జగన్ చెప్పాడు. ఎక్కడ ఆ మొత్తాన్ని, ఎన్ని ఇళ్ల నిర్మాణాని కి ఇచ్చాడో చెబితే మేం కూడా వెళ్లి ఆ ఇళ్లను పరిశీలిస్తాం. పేదల ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే సొమ్ములో రాష్ట్రప్రభుత్వ వాటా రూపాయి కూడా లేదు. కేంద్రప్రభుత్వం ఇచ్చే రూ.1.80లక్షలు తప్ప, జగన్ రెడ్డి రూపాయి ఇవ్వడంలేదు. ప్రచారం మాత్రం ఒక్కో ఇంటికి రూ.2.70లక్షలు ఇస్తున్నట్టు చేస్తున్నాడు. వాస్తవాలు ఇలా కనిపిస్తుంటే...జనాలు ఏంచెప్పినా నమ్ముతారులే అన్నట్టు జగన్ అబద్ధాలు చెబుతున్నాడు. పేదలపై జగన్ కు ప్రేమే ఉంటే తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల ఉన్న గుడిసెల్ని నేలమట్టం చేయించి పేదల్ని ఎందుకు తరిమేశాడు? సొంత తల్లికి చెల్లికి కూడపెట్టకుండా గెంటేసినవాడు ... రాష్ట్రంలోని అమ్మలు, అక్కచెల్లెళ్లను ఉద్ధరిస్తాడా? పేదలపై తనకు ఒక్కడికే అమితమైన ప్రేమ ఉన్నట్టు నక్కవినయాలు ప్రదర్శిస్తున్న జగన్ రెడ్డి.. తన తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల ఉన్న గుడిసెలు నేలమట్టం చేసి, ఆ దరిదాపుల్లో ఎక్కడా పేదలు లేకుండా ఎందుకు చేశాడో సమాధానం చెప్పాలి. రాష్ట్రాని కి ప్రజలకు నాలుగున్నరేళ్లలో తానేం చేసింది లేకపోవడంతో, ఏంచెప్పాలో తెలియక ఏ కార్యక్రమంలో మాట్లాడిన ప్రతిపక్షాలను.. మీడియా సంస్థలను... తిట్టడమే జగన్ పని గా పెట్టుకుంటున్నాడు. రిలయన్స్ అంబానీ.. అదానీ వంటి వారితో తిరిగే అసలైన పెత్తందారు అయిన జగన్ రెడ్డి పేదల పక్షపాతా? చంద్రబాబుకిఇల్లులేదు... పవన్ కల్యాణ్ కు ఇల్లులేదు అనే జగన్ రెడ్డికి ఊరికో ఇల్లుఉంది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ఇడుపులపాయ, పులివెందుల, తాడేపల్లి ఇలా.. ఎక్కడపట్టినా పెద్దపెద్ద రాజ భవనాలు నిర్మించుకున్నాడు. వాటిలో ఏంచేస్తాడో ఎవరికీ తెలియదు? చంద్రబాబుకి ఇల్లులేకపోవచ్చుగానీ.. ప్రజల గుండెల్లో స్థానముంది జగన్ రెడ్డి. ఆయన నిత్యం ప్రజల పక్షాన పోరాడుతూ... జగన్ అవినీతి, దోపిడీని ప్రశ్నిస్తూ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని బయటపెడుతున్నాడనే అన్యాయంగా జైలుకు పంపాడు. అక్కచెల్లెళ్ల ను తానే ఉధ్ధరించానంటున్న జగన్ రెడ్డి సొంతచెల్లిని ఎందుకు తరిమేశాడో చెప్పాలి. జగనన్న వదిలిన బాణం తెలంగాణలో ఎందుకు తిరుగుతోంది? ఈ రాష్ట్రంలో తనకు న్యాయం జరగదంటూ సొంత బాబాయ్ కూతురు ప్రాణభయంతో ఎందుకు పారిపోయిం దో, తనకు రక్షణ లేదని న్యాయస్థానాలకు ఎందుకు చెప్పుకుందో ముఖ్యమంత్రి చెప్పాలి. తల్లి తనను వదిలేసి ఎక్కడో ఎందుకుంటుందో జగన్ చెప్పాలి. సొంత తల్లికి చెల్లికి ధైర్యం ఇవ్వకుండా గెంటేసినవాడు.. రాష్ట్రంలోని అమ్మలు, అక్కచెల్లెళ్లను ఉద్ధరిస్తాడా? నాఎస్సీలు.. నా ఎస్టీలు.. నా బీసీలు ..నా మైనారిటీలు అనే మాట జగన్ నాలుకకే పరిమితం. మనసులో ఉండేదంతా వారిపై ఈర్ష్యాద్వేషాలే నా ఎస్సీలు.. నాఎస్టీలు.. నా బీసీలు... నా మైనారిటీలు అనే మాట జగన్ నాలుకపై నుంచి మాత్రమే వస్తుంది. మనసులో వారిపై ఆయనకుఎలాంటి ప్రేమ, అభిమానం లేవు.. ఈర్ష్యాద్వేషాలు ఉన్నాయనడానికి టీడీపీ ప్రభుత్వం వారికోసం తీసుకొచ్చిన పథకాలు రద్దుచేయడమే నిదర్శనం. ఆఖరికి ఎస్సీ, ఎస్టీల కోసం కేంద్రప్రభుత్వం అమలుచేసే పథకాల్ని కూడా రాష్ట్రంలో లేకుండా చేశాడు. ఎందుకంటే వాటి అమలుకోసం రాష్ట్రవాటాగా నిధులు చెల్లించాల్సి వస్తుందని. ఎస్సీల పథకాలు తమకు అవసరంలేదని కేంద్రానికి లేఖల లు రాసిన ముఖ్యమంత్రి కింద పనిచేస్తున్నందుకు నిజంగా వైసీపీ ఎస్సీనేతలు, ఆ సామాజికవర్గ మంత్రులు సిగ్గుతో తలదించుకోవాలి. చంద్రబాబు ఎప్పుడూ జనంలోనే ఉంటారు. ఆయన బయటకు రాగానే జనం జగన్ కు తగిన శాస్తి చేస్తారు అధికారంలో ఉన్నా...ప్రతిపక్షంలో ఉన్నా.. చంద్రబాబు ఎప్పుడూ జనంలోనే ఉంటారు. కానీ జగన్ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఆయనకే తెలియదు. అధికారం కోల్పోతే జైలుకెళ్లడం ఖాయమని తెలిసే, పదేపదే అబద్ధాలు.. అసత్యాలతోప్రజల్ని నమ్మించేం దుకు వెంపర్లాడుతున్నాడు. తనపై ఉన్న అవినీతి కేసుల విచారణ తిరిగి న్యాయస్థానా ల్లో మొదలైతే చాలు.. జగన్ కు నిద్రపట్టదు. చంద్రబాబునాయుడు నిజంగా తప్పు చేసి ఉంటే.. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్.. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్... ఇన్నర్ రింగ్ రోడ్ అంశాల్లో నిజంగా అవినీతి జరిగి ఉంటే, జగన్ ఇన్నాళ్లు చంద్రబాబుని, టీడీపీని వదిలేసేవాడా? దాదాపు 11ఏళ్లుగా తనపై ఉన్న కేసుల విచారణకు హాజరు కాకుండా, న్యాయస్థానా లకు కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటూ, సిగ్గులేకుండా చంద్రబాబుపై నిందలేస్తు న్నావా జగన్ రెడ్డి? గత ఎన్నికల్లో మాయమాటలు.. మోసపూరిత వాగ్ధానాలు చెప్పి ప్రజల్ని నమ్మించి ఒక్కఛాన్స్ అని నాటకాలాడి అధికారంలోకి వచ్చిన జగన్ ను మరలా నమ్మే స్థితిలో రాష్ట్రం లేదు. రాష్ట్రానికి పట్టిన జగన్ అనే ఖర్మను వదిలించుకో వడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు బయటకు వచ్చిన వెంటనే జనం జగన్ కు ఎలాంటి శాస్తి చేయాలో అది చేస్తారు. అని ఆనంద్ బాబు స్పష్టం చేశారు.

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

హనుమంతుని వాహన సేవలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా కుటుంబం హనుమంతుని వాహన సేవలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా కుటుంబం
మార్కాపురం: మార్కాపురం ఇల వేల్పు శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం ఉదయం హనుమంతుని వాహన సేవ నిర్వహించారు. ఈ సేవ లో...
నేటి పంచాంగం:  *శనివారం, ఏప్రిల్ 19, 2025*
పొన్న వాహనం పై విహరించిన చెన్నకేశవ స్వామి 
నేటి పంచాంగం:    *శుక్రవారం, ఏప్రిల్ 18, 2025*
బాపట్లలో విచిత్రమైన ఘటన .. కారు ఉన్నా రోడ్డేశారు..!
నేటి పంచాంగం:    *గురువారం, ఏప్రిల్ 17, 2025*
ఘనంగా  ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు జన్మదిన వేడుకలు