ప్రజా సంక్షేమ రథసారథి మన జగనన్న

On
ప్రజా సంక్షేమ రథసారథి మన జగనన్న

-ఎమ్మెల్యే అన్నా ఆదేశాలతో గిద్దలూరు లో ఘనంగా ముఖ్యమంత్రి జగనన్న జన్మదిన వేడుకలు

- భారీ కేక్ ను కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్న వైసీపీ నాయకులు

-వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించిన వైసీపీ నేతలు

-పేదలకు, యాచకులకు దుప్పట్లు పంపిణీ చేసిన వైసీపీ నాయకులు

-రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అన్నాను, జగనన్న ను అత్యధిక మెజారిటీ తో గెలిపిద్దాం
గిద్దలూరు: 
ప్రజా సంక్షేమ పథకాల రథసారథి మన ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని  పలువురు వైసీపీ ముఖ్య నాయకులు అన్నారు. గిద్దలూరు శాసన సభ్యులు అన్నా రాంబాబు  ఆదేశాల మేరకు గురువారం గిద్దలూరు పట్టణంలోని రాచర్ల రోడ్డులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగనన్న పుట్టినరోజు వేడుకల్లో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పార్టీ కార్యాలయ ఆవరణలో పలువురు వైసీపీ నాయకులు భారీ కేక్ ను కట్ చేసి ముఖ్య మంత్రి జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పలువురు పేదలకు,  యాచకులకు వైసీపీ నాయకులు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్టంలో మన జగనన్న ప్రతి పేదింటి ప్రజల పెద్ద కొడుకుగా, అవ్వాతాతల ముద్దుల మనవడిగా, ఆడపడుచులకు అన్నగా, విద్యార్థులకు మేన మామగా, రైతుల పాలిట ఆపద్భాందవుడిగా,బడుగు బలహీన వర్గాల ఆశాదీపంగా పేరు పొందారన్నారు. దివంగత నేత రాజన్న ఆశయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న జనహృదయ నేత అని కొనియాడారు. మనమందరం రాబోయే ఎన్నికల్లో జగనన్న కు, ఎమ్మెల్యే అన్నా రాంబాబుకి అండగా నిలిచి అత్యధిక మెజారిటీ తో గెలిపించుకోవాలన్నారు. ముందుగా పలువురు వైసీపీ నాయకులు రాచర్ల గేట్ సెంటర్లోని దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నియోజకవర్గ పరిధిలోని, ఆరు మండలాల్లో ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆదేశాల మేరకు పలువురు వైసీపీ నాయకులు జగనన్న వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ లు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, వైసీపీ నాయకులు, నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో -ఆప్షన్ సభ్యులు, వైసీపీ అనుబంధ విభాగాల  కార్పొరేషన్ డైరెక్టర్ సభ్యులు,పలు రాష్ట్ర, జిల్లా,  మండల కమిటీ సభ్యులు, టౌన్ కన్వీనర్, జెసియస్ ఇంచార్జి, సచివాలయ కన్వీనర్ లు, గృహ సారదులు, మహిళలు కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

IMG-20231221-WA0079

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

నేటి పంచాంగం:  *సోమవారం, మే 19, 2025* నేటి పంచాంగం:  *సోమవారం, మే 19, 2025*
*ఓం శ్రీ గురుభ్యోనమః*  *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*      *ఉత్తరాయనం - వసంత ఋతువు*     *వైశాఖ మాసం - బహుళ పక్షం*   తిథి      : *సప్తమి* రా1.28...
బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్ ఇచ్చిన భారత్
ప్రధాని మోదీతో లోకేష్ భేటీ
నేటి పంచాంగం: *ఆదివారం, మే 18, 2025*
టీటీడీ వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
నీటి ఎద్దడి పై గళం విప్పిన సర్పంచ్ లు
నెమలి గుండంలో భారీ వర్షం - నేలకొరిగిన వృక్షాలు