వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
పోలేరమ్మ తల్లి ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
అగ్ని న్యూస్,తర్లుపాడు: మండల కేంద్రం తర్లుపాడు లో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఈఓ ఈదుల చెన్నకేశవ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ఆనువంశిక ధర్మకర్త జవ్వాజి విజయ భాస్కర రావు పర్యవేక్షణ లో కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కారంపూడి రమణాచార్యులు, సాయి మోహన్ లు వేద మంత్రోశ్చరణ లతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధనుష్ రాశిలో సూర్యుడు సంచరించే మాసం ధనుర్మాసం అని, ఈ మాసం లో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా వ్యవహారిస్తారని అర్చకులు తెలిపారు. ముక్కోటి దేవతలైన బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర గుణాలు అసుర శక్తులపై విజయాన్ని సాధించడం కోసం శ్రీహరి అనుగ్రహన్ని ఆకాంక్షించాయి. సకల దేవతలు వైకుంఠ నారాయణుడిని దర్శనం పొందిన మహాత్తర సందర్బమే ముక్కోటి ఏకాదశి అంటారు అని తెలిపారు.ఈ సందర్భంగా ఆలయంలో పనిచేసే వారికీ ఆలయ అనువంశిక ధర్మకర్త జవ్వాజి విజయ భాస్కర్ రావు కుమారుడు సాయి కృష్ణ, కూతురు యోగద కృష్ణ జన్మదినం సందర్బంగా ఆలయం లో పనిచేసే సిబ్బంది కి దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం మువ్వగోపాలుడు తర్లుపాడు పురవీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు.
పోలేరమ్మ తల్లి ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
...............
తర్లుపాడు చెరువుకట్ట వద్ద వెలసిన పోలేరమ్మ ఆలయంలో తర్లుపాడు యువత సారథ్యంలో అభివృద్ధి పనులు జరుగుతున్న విషయం అందరికి విధితమే. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్బంగా ఆలయం చుట్టూ ఆవరణలో దాతల సహాయం తో చుట్టూ మెష్, అమ్మవారి ఆలయం చుట్టూ ఫ్లోరింగ్, అంతేకాకుండా ఆవరణలో పూల మొక్కలు, దేవదారు మొక్కలను గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో విఆర్ ఓ భాస్కర్ రెడ్డి,గ్రామ పెద్దలు సూరెడ్డి సుబ్బారెడ్డి, పోలేపల్లి జనార్దన్,కాళంగి శ్రీనివాసులు, కొలగట్ల భాస్కర్ రెడ్డి, వాడేల కృష్ణ ప్రసాద్,ఈర్ల వెంకటయ్య,గౌతుకట్ల సుబ్బయ్య, ఈర్ల కాశయ్య, మేకల వెంకట్, కుందురు చిన్న కాశిరెడ్డి, నేరెళ్ల సుబ్బారావు,గాధం శెట్టి గిరి, జవ్వాజి జనార్దన్, వాగిచర్ల మోహన్,చినమనగొండ సుబ్రహ్మణ్యం,దోగిపర్తి మల్లిఖార్జున, నేరెళ్ల కార్తీక్,చేతుల శ్రీనివాసులు,కె కాశీస్వరరెడ్డి,గోసు ఆది నారాయణ, ఎరువ పాపిరెడ్డి, కొలగట్ల శేఖర్,కుర్రి సుబ్బారాయుడు, బాసాని గాలిరెడ్డి,అయ్యప్ప స్వాములు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.