నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2,12,070
విలేకరుల సమావేశంలో సబ్ కలెక్టర్ రాహుల్
అగ్ని న్యూస్,మార్కాపురం: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి తుది ఓటర్ల జాబితాను ఫైనల్ చేసినట్లు సబ్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. సోమవారం సాయంత్రం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఓటర్ల జాబితాను బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్లు, సహాయ ఓటర్ల నమోదు అధికారులు అందరూ సమిష్టి కృషితో రూపొందించినట్లు తెలిపారు.నియోజవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,12,070 కాగా అందులో 1,06,777 పురుషులు, 1,05,288 మహిళలు, 10 మంది తర్డ్ జెండర్స్ ఓటర్లు ఉన్నారని తెలిపారు.నూతన ఓటర్ల తుది జాబితా ప్రకారం మార్కాపురం రూరల్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 41,207 కాగా అందులో 21,047 పురుషులు, 20,160 మహిళలు, మార్కాపురం పట్టణంలో మొత్తం ఓటర్ల సంఖ్య 55,305 కాగా, అందులో 27,069 పురుషులు, 28,235 మహిళలు,తర్లుపాడు మండంలో మొత్తం ఓటర్ల సంఖ్య 25,936 కాగా అందులో 13,259 పురుషులు, 12673 మహిళలు,కొనకనమిట్ల మండలంలో మొత్తం ఓటర్ల సంఖ్య 38,072 కాగా అందులో 19,389.మంది పురుషులు, 18,683 మంది మహిళలు,పొదిలి మండలంలో మొత్తం ఓటర్ల సంఖ్య 22,283 కాగా అందులో 11,404 మంది పురుషులు, 10,879 మహిళలు,పొదిలి నగర పంచాయతీలో మొత్తం ఓటర్ల సంఖ్య 29,267 మంది కాగా అందులో 14,609 మంది పురుషులు, 14,658 మంది మహిళ ఓటర్లు వున్నట్లు సబ్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు.ఆయా పోలింగ్ స్టేషన్లలో ప్రచురించిన ఓటర్ లిస్టులో మీ ఓటుకు సంబంధించిన వివరాలను పరిశీలించి అందులో ఏమైనా మార్పులు, చేర్పులు, తొలగింపులు అవసరమైన ఎడల ఫారం 6, ఫారం 7, ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.అలాగే నూతన ఓటర్ లిస్టును గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించి అందులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే ఓటర్ల నమోదు అధికారి దృష్టికి తీసుకొని రావాలని కోరారు.ఈ విలేకరుల సమావేశంలో మండల తహసిల్దార్ మంజునాథ్ రెడ్డి పాల్గొన్నారు.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.