వైసీపీ గెలుపుకు సోషల్ మీడియా సభ్యులు కృషి చేయాలి
సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం లో ఎమ్మెల్యే,
మార్కాపురం వైసీపీ సమన్వయ కర్త అన్నా
మార్కాపురం: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని గిద్దలూరు శాసన సభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు పిలుపునిచ్చారు. ఆదివారం జవహర్ నగర్ కాలనీలోని ఎమ్మెల్యే అన్నా నివాసంలో మార్కాపురం నియోజకవర్గ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగనన్న ఆదేశాల మేరకు నేను 2024 ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గం నుండి పోటీ చేయడం జరుగుతుందన్నారు.మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్క సోషల్ మీడియా సభ్యుడు పార్టీ గెలుపు కు కృషి చేసి సహకరించాలన్నారు. నేటి కాలంలో సోషల్ మీడియాది ప్రత్యేక స్థానమన్నారు. వైసీపీ సోషల్ మీడియా సైన్యాన్ని చూసి ప్రతి పక్షాలు బయపడుతున్నాయన్నారు. ముఖ్య మంత్రి జగనన్న పేద ప్రజలకు అందిస్తున్న నవరత్నాల పథకాలను, మన ప్రభుత్వం లో మంచి జరిగిన వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి జగనన్న ను ముఖ్య మంత్రి చేసుకుందామన్నారు. ముందుగా మార్కాపురం వైసీపీ సోషల్ మీడియా సభ్యులు ఎమ్మెల్యే అన్నా ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఎయంసీ చైర్మన్ షంషీర్ ఆలీబేగ్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ మేడ బదరీ,వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని సోషల్ మీడియా కన్వినర్లు, సభ్యులు పాల్గొన్నారు.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.