అన్నా ను కలిసిన తర్లుపాడు అసమ్మతి వర్గం
-రెడ్డి సామాజిక వర్గం లో ఒక నాయకుడికి పై వ్యతిరేకత
తర్లుపాడు : వైసిపీ మార్కాపురం ఇంచార్జీ గా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు వచ్చినప్పటి నుండి తర్లుపాడు మండలం లో పలు గ్రామాల్లో అసమ్మతి నెలకొన్నది అందరికి విధితమే. అయితే తర్లుపాడు శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలలో రధోత్సవం నాడు బ్యానర్ లో ప్రోటోకాల్ లేకుండా ఎమ్మెల్యే ,ఇంచార్జీ ఇద్దరి ఫొటోస్ లేకపోవటం ...ఆ విషయం అగ్ని దినపత్రికలో రావటం అందరికి తెలిసిందే. కానీ ఈ వర్గపోరు తారా స్థాయికి చేరుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో తర్లుపాడు గణేష్ రెడ్డి యూత్ కొలగట్ల శ్రీనివాసరెడ్డి, ఏర్వ మహీధర్ రెడ్డి,ఆర్ కె, సత్యం రెడ్డి, కొప్పుల జగదీష్ రెడ్డి, ఏర్వ మస్తాన్ రెడ్డి, వెంకటేశ్వర్ల రెడ్డి, శ్రీనివాసరెడ్డి,పోలీరెడ్డి, ఏర్వ నాగిరెడ్డి, మారంరెడ్డి కృష్ణారెడ్డి,వెన్నా వెంకటేశ్వరరెడ్డి, నడికట్టు బసిరెడ్డి,దాదాపు 20మంది తర్లుపాడు రెడ్డి యూత్ కంభం లో డిప్లమో కాలేజ్ సమీపంలో మార్కాపురం ఇంచార్జీ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును కలిశారు. తర్లుపాడు లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడు పై అసమ్మతిని ,వ్యతిరేకతను, వారికి జరిగిన అన్యాయం గురించి ఎమ్మెల్యే అన్నా రాంబాబు దృష్టికి తీసుకెళ్లారు. 2019 ఎలక్షన్ మొదలుకుని రెడ్డి యూత్ పార్టీ కోసం ఎంతో కష్ట పడ్డామని దానికి తగిన గుర్తింపు న్యాయం వారికి జరగలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.గతం లో ఏమి జరిగిందో వదిలేసి ఇకపై పార్టీ కోసం పని చేయాలని,వైసిపీ ఎమ్మెల్యే అభ్యర్థి గా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇక్కడికి పంపించారాని అయన మీద విధేయత తో పార్టీ గెలుపు కోసం కలిసి కట్టుగా శ్రమించి పని చేయండి మీకు తగిన గుర్తింపు న్యాయం చేసే బాధ్యత నాది అని అన్నా రాంబాబు వారికి హామీ ఇచ్చారు .ఎవరి ప్రమేయం లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా మీరు నన్ను సంప్రదించండి మీ సమస్యలు నా దృష్టికి తీసుకు రావొచ్చనీ అనటం తో రెడ్డి యూత్ ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు. వర్గపోరు ఇంతటితో ముగుస్తుందో లేదో తెలియాలి అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వరకు వేచి ఉండాల్సిందే మరి.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.