బీ.చేర్లోపల్లె లో తాటిపత్రి ఆదేశాలతో నీటి సమస్య పరిష్కారం
నీటి బోర్ ను వేయించిన ఎంపీపీ బెజవాడ
పెద్దారవీడు: సాధారణంగా పశ్చిమ ప్రాంతం ఎర్రగొండపాలెం నియోజకవర్గము అంటే వెనకబడిన ప్రాంతంగా చెప్పుకోవచ్చును ఈ ప్రాంతంలో ప్రధాన సమస్య నీటి సమస్య.. పరిష్కారం కోసం గత పాలకులు ఎన్నో ప్రయోగాలు చేశారు... కానీ సాధ్యపడలేదు..
వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి గా తాటిపత్రి చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నీటి సమస్యపై ప్రధాన ఫోకస్ పెట్టారు.. ఎలాగైనా ఈ ప్రాంతం వాసుల నీటి కష్టాలు తీర్చాలని సంకల్పంతో నా సొంత నిధులతో ట్యాంకర్ లు ద్వారా ప్రస్తుతానికి నీటిని సరఫరా చేసుకోండి నేను మీ గ్రామానికి వచ్చేనాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తానని నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితమైన హామీ ఇచ్చారు.దానిలో భాగంగా.పెద్దారవీడు మండలంలోని బీ.చేర్లో పల్లె గ్రామంలో నెలకొన్న తీవ్ర త్రాగునీటి ఎద్దడి నివారణకు బోర్ ను ఏర్పాటు చేయవలసిందిగా ఎర్రగొండపాలెం వైసీపీ ఇన్చార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ ని గ్రామ వైసిపి నాయకులు మాజీ ఎంపీటీసీ మూల రమాదేవి, మూల అల్లు రెడ్డి, ఎంపీటీసీ మూడ మంచు రాజారావు, మాజీ సర్పంచి మూల లక్ష్మిరెడ్డి, మూల రామకోటి రెడ్డి కోరగా వెంటనే స్పందించిన ఆయన బోరు వెయ్యామన్ని ఎంపీపీ బెజవాడ పెద్ద గురవయ్య కు తెలియజేశారు.గురువారం బీ.చేర్లోపల్లె లో ఎంపీపీ నిధులతో బోరు వేసి ఎంపీపీ తండ్రి బెజవాడ మోషే ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ మూల రమాదేవి , ఎంపీటీసీ రాజారావు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్న వెంటనే పరిష్కరిస్తూ ప్రజలకు సేవ చేయడానికే మీలో ఒకడిగా ఉండే వ్యక్తి గా నేను ఉన్నాను అని నియోజకవర్గ ప్రజలకు బోరోసా ఇచ్చిన మంచి వ్యక్తి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా చంద్రశేఖర్ ను గెలిపించుకోవాలని కోరారు.
ఇంచార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్, ఎంపీపీ బెజవాడ పెద్ద గురవయ్య కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మూల రమాదేవి, ఎంపీటీసీ మూడమంచు రాజారావు, ఎంపీపీ తండ్రి బెజవాడ మోషే,మాజీ సర్పంచ్ మూల లక్ష్మిరెడ్డి, వైసిపి నాయకులు మూడ రామకోటి రెడ్డి, కర్ర శ్రీనివాసరెడ్డి ,గ్రామస్తులు పాల్గొన్నారు
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.