ఖాద్రి లక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవ వేడుకలు

వేలాదిమంది భక్తుల నడుమ వైభవంగా ఉత్సవాలు

On
ఖాద్రి లక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవ వేడుకలు

అగ్ని న్యూస్, కదిరి: నవ నరసింహుని క్షేత్రములలో కెల్ల భక్త ప్రహ్లాద సమేతముగా స్వయంభూగా వేలశియున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయము, చారిత్రాత్మకంగా వాసికెక్కిన ప్రశిద్దిమైన వైష్ణవ క్షేత్రం.

శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు 19.03.2024 నుండి 02.04.2024 వరకు అత్యంత వైభోపేతముగ జరుగును.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 7వ రోజు సోమవారం ఆది శేష వాహనంపై విహరించారు.ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
"అనంతశ్చాస్మి నాగానాం" అని భగవత్ గీత అతల వితాలాది పాతాళ లోకములను, భూ,భువర్ లోకాది ఉన్నత లోకములను, మహనాలయమాణుడు, సహస్ర ఫణి మని మండలములు కల వాడు, భూభారధారణుడు, కాల సాక్షి స్వరూపుడు అయిన "ఆదిశేషుడు" ఈరోజు "శ్రీ ఖాద్రి నృసింహుడికి" శేష తల్పుడై వొచ్చి "ఆదిశేష వాహనం మై" సేవ చేస్తున్నారు
వైకుంఠపుర నివాసుడి శయన వాసం
'శేష' అనగా 'సంతులనం', సర్పం కాలనికి సూచిక.
శేషతల్పంపై శ్రీ మహావిష్ణువు
నిద్రించడం,దేనికి అతీతం కాకుండా సమయాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారని అర్థం.
శ్రీ వైకుంఠంలో శ్రీవారి నిత్యసూర
వర్గంలో శేషుడు, ప్రాధన్యుడు.స్వామికి
క్షీరసాగరంలో పరమపదంలో
గృహంగా,శయన మందిరంగా,పడకగా,
అసనంగా,పాదుకలుగా,వస్త్రంగా,దిండుగా, గొడుగుగా-ఆయా అవసరాలకు
తగినట్లు,విధములగు భోగోపకరణములుగా సకల "రాజోపచారములు"
సేవ చేయు కారణ జన్ముడు, భాగ్యశాలి అని
"యమునాచార్యుల" వారి స్తోత్రం. శేషుడున్న
శ్రీవారికేమి కొరత అని "పన్నగమును
దోమతెరగ" అని "అన్నమయ్య కీర్తన"
స్వార్ధం లేనే దాస కైంకర్యనికి శేషుడు ప్రతిక.
ధర్మసంస్థాపనార్దమ్ అవతారములెత్తుటలో
స్వామి వెంటే తోడుగా అన్ని యుగాలలోను
శ్రీ మహావిష్ణువును శరణాగతితో కొలిచిన
భక్తాగ్రేసరుడు మొదట వైకుంఠంలోను
అనంతుడైన "ఆదిశకేషునిగాను",
త్రేతాయుగంలో 
 "లక్ష్మణుని గాను", ద్వాపరమ్ లో "బలరామునిగాను", కలియుగంలో "భగవద్రామానుజులగాను" అవతరించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది పదివేల మణి మండలములు పడగలు గా,ప్రతి శిరస్సు తో "భగవత్ లీలామృతలను" సృష్టి ప్రారంభం నుండి గాణం చేస్తు శాశ్వత గాణ కోవిదుడిగా,కీర్తింపబడుతున్నాడు ఈ సహస్ర ఫనీంద్రుడు కర్మ "శేషం" వల్లనే ఆత్మ అనేక జన్మలు ఎత్తుతుంది.జీవి కూడా ఒకోసారి భక్తితోను, మరికొన్ని సార్లు విస్మృతితోను భగవంతుణ్ణి కొలుస్తాడు. ఈ హెచ్చుతగ్గుల "శేషం" పోయి నిశ్శేషమైన, అమలిన భక్తిని పొందిననాడే ముక్తి అని తెలుపడమే "శేషవాహనం" పై ఉన్న "వైకుంఠ నారసింహ" దర్శనం చెబుతోంది. పురాణాలలో శేషాదులను, దిక్పాలకులుగా వర్ణించారు. తూర్పుకు అనంతుడు, అభోగ, దక్షిణాన వాసుకి, నైరుతి మూలన శంఖసాల వాయువ్యంలో కులిక, ఈశాన్యంలో మహాపద్ముడు దిక్పాలకులయ్యారు. ఇంతటి దిక్ సురులు వాహనంగా ఈరోజు "శ్రీ ఖాద్రి వైకుంఠ నాధుడు" కి సేవ చేస్తుండగా స్వామి వారిని దర్శించడం వంశవృద్ధి కరం,మోక్ష దాయకం అని అగమశాస్త్ర చెబుతున్నాయి శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. శ్రీవారిని విశేష మృదంగా వాద్యముల కీర్తనలతో చతుర్ మాడ వీధుల్లో ఊరేగే దివ్య దృశ్యాన్ని భక్తులు కనులారా వీక్షించారు. "ఓం శ్రీ ఖాద్రి వైకుంఠ పుర నివాస" అని భక్తుల కీర్తనాలతో, స్మరణతో, భక్తులు ఆరాధన చేసుకొని, ఖాద్రి క్షేత్రం పునీతమైనది.

IMG-20240326-WA0004IMG-20240326-WA0003

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

రైలు నుంచి జారిపడి మహిళ మృతి రైలు నుంచి జారిపడి మహిళ మృతి
ప్రకాశం జిల్లా: కంభం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి మావమ్మ (44) అనే మహిళ మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. మహిళ బెంగుళూరు...
భార్యని చంపిన భర్త
ఎమ్మెల్యే ల పనితీరు పై ప్రజల నుంచి ఫిర్యాదులు
నేటి పంచాంగం:     *ఆదివారం, జూన్ 22, 2025*
బేస్తవారిపేటలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి 
నేటి పంచాంగం:  *శనివారం, జూన్ 21, 2025*
అష్టాదశ శక్తిపీఠాలు