ఎంపీ అభ్యర్థి,ఎమ్మెల్యే అభ్యర్థులకు ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు
భారీ బైక్ ర్యాలీ తో ఆకట్టుకున్న పార్టీ నాయకులు
మార్కాపురం: మే నెల 13 న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి పై ఒకటి, ఎమ్మెల్యే అభ్యర్థి పై మరొకటి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు పై ప్రతి ఒక్కరూ ఓటు వేసి వేయించి గెలిపించాలని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మార్కాపురం వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబు అభ్యర్థించారు. సోమవారం మార్కాపురం పట్టణంలోని SVKP కళాశాల ఎదురుగా స్థలంలో ఏర్పాటు చేసిన మార్కాపురం మండలం మరియు మున్సిపాలిటీ పరిధిలోని వైసీపీ నాయకులు,కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు. ముందుగా మార్కాపురం లోని LV ప్రసాద్ ఐ హాస్పిటల్ నుండి SVKP కళాశాల వరకు వైఎస్సార్ సీపీ యువత సభ్యులు భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థులు బైక్ పై ర్యాలీ లో పాల్గొని ప్రచారం నిర్వహించారు. అనంతరం SVKP కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం లో వారు మాట్లాడుతూ ప్రతి పేదవానికి మంచి చేయాలన్నదే జగనన్న లక్ష్యం అన్నారు. అలాంటి మంచి చేస్తున్న ప్రభుత్వానికి మనమందరం అండగా ఉండి రానున్న ఎన్నికల్లో జగనన్న బల పరచిన వైసీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధి కి మేము ఎల్లవేళలా అందుబాటులో ఉండి కృషి చేస్తామన్నారు. గత ఐదేళ్ల జగనన్న పాలనలో లక్షలాది కుటుంభాలకు లబ్ది చేకూరిందన్నారు. సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా పనిచేసిన జగనన్న పాలన ను మరలా అత్యధిక మెజారిటీ తో గెలిపించుకుందామన్నారు.ముందుగా పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ గజమాలతో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని ఎమ్మెల్యే అభ్యర్థులు అన్నా రాంబాబు , కుందూరు నాగార్జున రెడ్డి ,ఏపీఐఐసి చైర్మన్ జంకే వెంకట రెడ్డి లను ఘనంగా సన్మానించి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సంతనూతలపాడు శాసన సభ్యులు సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాస రెడ్డి , వైసీపీ ముఖ్య నాయకులు వెన్నా హనుమారెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం మండలం మరియు మున్సిపాలిటీ పరిధిలోని వైసీపీ ముఖ్య నాయకులు,ప్రజాప్రతినిధులు,నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.