నన్ను ఓడించడం ఎవడబ్బ తరం కాదు
ప్యాకేజీ స్టార్లకు వార్నింగ్ - ఇవే నా చివరి ఎన్నికలు.. నామినేషన్ ర్యాలీలో కందుల
-
అగ్ని ప్రతినిధి, మార్కాపురం:
మార్కాపురం నియోజకవర్గ ఎన్నికల రణక్షేత్రం తారాస్థాయికి చేరింది. గురువారం టిడిపి మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నామినేషన్ ర్యాలీ అట్టహాసంగా సాగింది. వేలాదిగా కార్యకర్తలు తరలి రావడంతో వీధులన్నీ పసుపు మయమయ్యాయి. ర్యాలీ లో కార్యకర్తలను ఉద్దేశించి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నన్ను ఓడించడం ఎవడబ్బ తరం కాదు అంటూ కందుల నారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. అంతేకాదు ప్యాకేజి స్టార్లు కూడా నా గురించి మాట్లాడుతున్నారంటూ పరోక్షంగా వైసిపి జిల్లా అధ్యక్షులు ఏపీఐఐసీ చైర్మన్ జంకే వెంకటరెడ్డి ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు, కులం పేరుతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ కులగజ్జిని తనకు అంటించాలని చూస్తున్నాడని దాని పర్యవసానం త్వరలో చూస్తారంటూ పరోక్షంగా హెచ్చరించారు.వచ్చే నెల 13 న జరిగే ఎన్నికల్లో టిడిపి తరఫున బరిలో ఉన్న తనకు ప్రజలు పట్టం కట్టబోతున్నట్లు స్పష్టం చేశారు.ఒకవైపు డబ్బులు, ప్యాకేజీలు మరోవైపున 22 సంవత్సరాల సేవ,పోరాటం చేస్తున్నాయని అన్నారు. నియోజకవర్గంలో తన సేవ, తాను చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.మార్కాపురం జిల్లా, వెలుగొండ ప్రాజెక్టు తన ద్వారానే సాధ్యం అని పేర్కొన్నారు.వైసీపి నాయకులు ఈ నియోజకవర్గం అభివృద్ధి కి ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.ఇవే నా చివరి ఎన్నికలు అని, ఏదైనా తేడా వస్తే చావే శరణ్యం అని మరోసారి ఉద్ఘాటించారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట మానవత్వం ఉన్న మహారాజు అని, వైసిపి ఎంపీ అభ్యర్థి ఎవరో తెలుసా...పుష్ప అంటూ విమర్శించారు. ఇప్పటి వరకు ఇక్కడ పాలన సాగించిన నాయకులు కబ్జాలకు, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించారు. చంద్రన్న ప్రభుత్వం వస్తుందని,మీ కష్టాలు తీరుతాయి అని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవరెడ్డి మాట్లాడుతూ జగన్ రెడ్డి మమ్మల్ని చట్టసభల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటాడట, మీరు మమ్మల్ని సభకు పంపిస్తారా అంటూ ప్రశ్నించారు. మమ్మల్ని ఆపడం జగన్ రెడ్డి తో కానిపని అని సిఎం జగన్ పై విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున, కందుల రామిరెడ్డి, తాళ్ళపల్లి సత్యనారాయణ,జనసేన నాయకులు ఇమ్మడి కాశీనాధ్, బీజేపీ నాయకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.