వైసీపీ ని కాపాడుకునేందుకే చంద్రబాబు పై అక్రమ కేసులు
టీడీపీ యస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మేడ రామకృష్ణ
అగ్ని న్యూస్,గుంటూరు: జగన్ మోహన్ రెడ్డి 5 ఏళ్ళుగా చంద్రబాబును తిట్టడం, పవన్ కల్యాణ్ ను దుమ్మెత్తి పోయడం తప్ప సంక్షేమం అభివృద్ధి మీద దృష్టి సారించలేదని టీడీపీ యస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ రామకృష్ణ అన్నారు. రాజధాని అమరావతికి కులం రంగు పులిమి మూడు రాజధానుల రాక్షస క్రీడతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి తీరని ద్రోహం చేసిన ఘనత జగన్ కు మాత్రమే దక్కుతుంది అని అన్నారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడి తీరా ఎన్నికలు రావడంతో ప్రజల్లోకి వెళ్లి ఓట్లడిగే దిక్కు లేక వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలోకి వెళ్ళిపోతారేమోననే భయంతో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని తెలిసి వైసిపి పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు కి అవినీతి పులిమి అక్రమ కేసులు బనాయించి అరెస్టులతో రాజకీయ పబ్బం గడుపుకుంటూ జగన్ మోహన్ రెడ్డి మేకవన్నె పులిలా తేనె పూసిన కత్తిలా డ్రామాలు ఆడుతున్నారని మేడా రామకృష్ణ ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డి, సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు చంద్రబాబుపై కుట్రపూరితంగా ఫిర్యాదులు చేసిన కేసులు కాదా అని ప్రశ్నించారు.జగన్ మోహన్ రెడ్డి మాటలు అమాయక వైసిపి నేతలు వింటారేమో కానీ దువ్వెనతో జగనన్న దువ్వెన కార్యక్రమం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని మేడా రామకృష్ణ అన్నారు . నాలుగు సున్నాలు కలిస్తే గుడ్డి సున్నానే అంటూ ప్రతిపక్ష పార్టీల పొత్తును వెక్కిరిస్తున్న జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలలో నవ్యాంధ్రకు నవరంధ్రాలు చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బొక్కాంధ్ర అనే స్థాయికి దిగజార్చడం పెద్ద గొప్ప అన్నట్లుగా ప్రగల్భాలు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు సారధ్యంలో పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తామని మీ అవినీతి అరాచకాలపై ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పేందుకు నోరుపారేసుకుంటున్న వైసిపి, కాబోయే మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు సిద్దంగా ఉండాలని హెచ్చరించారు. వైసిపికి పవన్ కళ్యాణ్ దత్త పుత్రుడు వలే కనిపిస్తుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నా ఓటు చీలనివ్వను అని టిడిపితో పొత్తు ప్రకటించడంతో వైసిపి పాలిట ఘరాణా మొగుడిలా కనిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు.వైసిపి ఎమ్మెల్యేలు గంప గుత్తగా టిడిపి, జనసేన కూటమిలోకి రాబోతున్నారని ఎన్నికల అనంతరం వైసిపి పార్టీ ఉండదని వైసిపిని నమ్ముకున్న వాళ్ళకంతా లండనే గతి అని మేడా రామకృష్ణ జోస్యం చెప్పారు.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.