శరత్ పూర్ణిమ విశిష్టత

అక్టోబరు 28 శనివారం శరత్ పూర్ణిమ సందర్భంగా.

On
శరత్ పూర్ణిమ విశిష్టత

ఆశ్వీయుజ పూర్ణిమకే శరత్ పూర్ణిమ అని పేరు. ఇది అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. మామూలు ప్రజలు అమ్మవారి ఆరాధన దేవి నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవీ ఉపాసకులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఏడాదిలో ఈ పూర్ణిమ నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువలన ఈ రోజు చంద్రుడిని పూజించాలి.

ఈ శరత్ పూర్ణిమ రోజున చందకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరిక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. అందువలన చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేయడం, ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి, ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెప్తోంది. చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్రకిరణాల లో ఉన్న ఓషిధీతత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మరునాడు ఉదయం ఆ పరమాన్నాన్ని కుటుంబసభ్యులందరూ నైవేధ్యంగా స్వీకరించాలి.

శ్రీ కృష్ణుడు పరిపూర్ణావతారం. ఆయనలో 16 కళలున్నాయి. అందుకే ఈ శరత్ పూర్ణిమను బృందావనంలో రాసపూర్ణిమ అంటారు. శ్రీ కృష్ణుడు ఈ రోజే మహారాసలీల సలిపాడని అంటారు. కృష్నుడి వేణుగానం విన్న గోపికలు, అన్నీ వదిలేసి ఆయన కోసం అడవిలోకి పరిగెత్తగా, కొన్ని వేలమంది కృష్ణులు వేలమంది గోపికలతో ఈ పున్నమి రాత్రి మొత్తం నాట్యం చేసారట.

ఈ పూర్ణిమకే కోజాగరి పూర్ణిమ అనే పేరు కూడా ఉంది. కోజాగరీ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు.

అశ్వినీ మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున కోజాగర వ్రతం " పాటిస్తారు. లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం ఈ వ్రతం పాటిస్తారు. దీనిని కోజగర పూర్ణిమ వ్రతం లేదా కోజాగిరి పూర్ణిమ అనికూడా అంటారు. ఈ తిథి లక్ష్మీ దేవి ఆగమనాన్ని సూచిస్తుంది. ఈ రోజున రాత్రి లక్ష్మీదేవి భూ లోకంలో తిరుగుతుంది. ఈ రోజున వ్రతం పాటించి, ఉపవాసం ఉండి, జాగరణ చేస్తారో వారిని లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుంది.

*కోజాగర వ్రత పూజ 28 అక్టోబర్ 2023 శనివారంనాడు జరుపుకుంటారు. పౌర్ణమి తేదీ 27 అక్టోబర్ 2023 04:17కు ప్రారంభమై 28 అక్టోబర్, 2023 25:54కి ముగుస్తుంది.*

కోజాగరా ఉపవాసం రోజున ఉదయమే లేచి సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. శుభ్రమైన దుస్తులు ధరించాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. లక్ష్మీ, విగ్రహాన్ని దేవాలయంలో లేదా పూజా స్థలంలో ఉంచాలి. అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలు సమర్పించాలి. లక్ష్మీ దేవి మంత్రం జపించి, నెయ్యి దీపం వెలిగించాలి. లక్ష్మి దేవికి పుష్పాలు, మాలలు సమర్పించాలి. తరువాత పంచామృతం సమర్పించాలి. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించిన తరువాత హారతి ఇవ్వాలి.

ఇలాగే మళ్లీ సాయంత్రం కూడా పాటించాలి. నైవేద్యంగా పాయసం అమ్మవారికి తప్పనిసరిగా సమర్పించాలి. రాత్రి చంద్రోదయం కాగానే నెయ్యి దీపాలు వెలిగించాలి. పచ్చిపాలు, నీళ్ల మిశ్రమంతో చంద్రుడిని పూజించాలి. శ్రీ లక్ష్మీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం పఠిస్తే అమ్మవారు ప్రసన్నం అవుతుంది.

లక్ష్మీదేవికి సమర్పించిన అన్ని నైవేద్యాలను ప్రసాదంగా పంచాలి. జాగరణ పాటించాలి. కోజాగర వ్రత కథ వినాలి. వ్రత కథ వినడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వసిస్తారు.

*🪔 కోజాగర వ్రత కథ 🪔*

పూర్వం మగధ అనే రాజ్యం ఉండేది. ఒక మంచి బ్రాహ్మణుడు ఆ రాజ్యంలో నివసించేవాడు. అతనికి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. కానీ పేదవాడు. బ్రాహ్మణుని భార్య పూర్తిగా అతనికి వ్యతిరేకం. ఆమె స్వార్థపరురాలు, బ్రాహ్మణుడి మాట వినడానికి నిరాకరించేది.

ఆమె పేదరికం కారణంగా భర్తను తిడుతూ వుండేది. ఇతరుల ముందు అతన్ని అవమానించేది. ఆమె బ్రాహ్మణుడిని దొంగతనం చేయమని, తప్పుడు మార్గాల ద్వారా డబ్బు సంపాదించమని చెబుతుంది. భార్య వెక్కిరింపులకు బ్రాహ్మణుడు విసిగిపోయాడు. ఒక రోజు ఇంటిని విడిచి అడవుల్లో నివసించడానికి వెళ్లిపోయాడు.

అతను అడవిలో నాగ కన్యలను కలుస్తాడు. అతని విచారానికి కారణం అడిగి తెలుసుకున్నారు. అతని సమస్యను పరిష్కరించడానికి నాగ కన్యలు అతన్ని అశ్విన్ పూర్ణిమ రోజున కోజాగర్ ఉపవాసం ఉండమని, రాత్రి జాగారం చేయమని చెబుతారు. బ్రాహ్మణుడు తన ఇంటికి తిరిగి వెళ్లిన తరువాత కోజాగర పూర్ణిమ రోజు లక్ష్మీ పూజ నిర్వహిస్తాడు. అన్ని పద్ధతులు సక్రమంగా ఆచారిస్తాడు. ఫలితంగా అతనికి అంతులేని సంపద, శ్రేయస్సు కలుగుతుంది. అతని భార్య స్వభావంకూడా మారి మంచి మార్గంలో నడుస్తుంది. ఆ దంపతులు సంతోషకరమైన జీవితం గడుపుతారు.

కోజాగర పూర్ణిమ అత్యంత ముఖ్యమైన పర్వదినం. ఈ రోజును శరద్ పూర్ణిమ, అశ్విన్ పూర్ణిమ, రాస్ పూర్ణిమ అనికూడా జరుపుకుంటారు. కొన్ని ప్రదేశాలలో దీనిని కౌముది ఉత్సవ్ అనికూడా పిలుస్తారు. ఈ రోజున శ్రీకృష్ణుడు, రాధను తలచుకుంటూ బృందావనంలో వేడుకలు నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.

అశ్విన్ పూర్ణిమనాడు చంద్రుడిని పూజిస్తే ఆయురారోగ్యాలు, అప్టైశ్వర్యాలు లభిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కోజాగర పౌర్ణమి కిరణాలు అమృతత్వాన్ని కలిగి ఉంటాయి.

ఈ రాత్రి చంద్రకాంతి కింద కాసేపు కూర్చుంటే, ప్రాణాంతక వ్యాధుల బారినుండి బయట పడవచ్చని నమ్ముతారు.

*🛕కౌముది పండుగ🛕*

సాంప్రదాయకంగా కౌముది పండుగను కొజాగరా ఉపవాసం రోజున జరుపుకుంటారు. కౌముది లక్ష్మీ వ్రతం ప్రేమానురాగాలను ప్రతిబింబిస్తుంది. పేదరికాన్ని తొలగిస్తుంది. కౌముది పండుగ జానపదుల సాంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని చెబుతారు. ఈ రోజున గృహాలను, దేవాలయాలను శుభ్రం చేసుకొని. చక్కగా -గా అలంకరించుకుంటారు.

కౌముది పండుగలో శివ పార్వతులను పూజిస్తారు. ఈ పూజ వలన మనోభిష్టాలన్నీ నెరవేరుతాయి. అవివాహితులకు వివాహం త్వరగా జరుగుతుంది. వివాహితలకు సంతోషకరమైన జీవితం లభిస్తుంది.

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

హనుమంతుని వాహన సేవలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా కుటుంబం హనుమంతుని వాహన సేవలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా కుటుంబం
మార్కాపురం: మార్కాపురం ఇల వేల్పు శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం ఉదయం హనుమంతుని వాహన సేవ నిర్వహించారు. ఈ సేవ లో...
నేటి పంచాంగం:  *శనివారం, ఏప్రిల్ 19, 2025*
పొన్న వాహనం పై విహరించిన చెన్నకేశవ స్వామి 
నేటి పంచాంగం:    *శుక్రవారం, ఏప్రిల్ 18, 2025*
బాపట్లలో విచిత్రమైన ఘటన .. కారు ఉన్నా రోడ్డేశారు..!
నేటి పంచాంగం:    *గురువారం, ఏప్రిల్ 17, 2025*
ఘనంగా  ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు జన్మదిన వేడుకలు