దళితులకు రక్షణ ఇవ్వకపోగా...ప్రజలు, ప్రతిపక్షాలపై అక్రమకేసులు పెడుతున్న జగన్ రెడ్డి
నక్కా ఆనంద్ బాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు
అమరావతి :వైసీపీ ప్రభుత్వం ఒకవైపు సామాజిక సాధికార బస్సుయాత్రని రెడ్డి సామాజిక వర్గ నేత లు జోన్ల వారీగా పర్యవేక్షిస్తుంటే... దళిత మంత్రులు, నేతలు మాత్రం గంగిరెద్దుల్లా ఊరే గుతున్నారని, బీసీ, మైనారిటీ వర్గాల మంత్రులు అడ్డంగా తలలూపుతున్నారని, వైసీపీ బస్సుయాత్రకు దగ్గరుండి కాపలా కాస్తున్న పోలీసులు.. టీడీపీనేతల్ని ఇళ్లలో నుంచి అడుగు బయటపెట్టకుండా ఆంక్షల పేరుతో అడ్డుకుంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ...,
టీడీపీ నేతల్ని అడుగడుగునా అడ్డుకుంటున్న పోలీసులు.. వైసీపీనేతలు, మంత్రుల సామాజిక సాధికార బస్సుయాత్రను మాత్రం దగ్గరుండి నడిపిస్తున్నారు.
బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా.. ప్రధాన ప్రతిపక్షనేతలుగా తెలుగుదేశం పార్టీ నేతలు ఏ కార్యక్రమం చేపట్టినా పోలీసులు సెక్షన్ 30...సెక్షన్ 144 అమల్లో ఉన్నాయ ని.. శాంతిభద్రతలకు విఘాతమని.. ప్రజా జీవనానికి ఆటంకమని కుంటిసాకులు చెప్పి అడ్డుకుంటున్నారు. ఆఖరికి మౌనప్రదర్శనలు..కొవ్వొత్తుల ర్యాలీ వంటివాటిని కూడా అడ్డుకుంటున్నారు. వైసీపీయాత్రలు.. అధికారపార్టీ నేతల సభలు సమావేశాలకు మాత్రం నడిరోడ్లపై మీటింగులకు అనుమతిస్తున్నారు. మంత్రులు.. వైసీపీ ఎమ్మెల్యేల మీటింగుల నుంచి ప్రజలు వెళ్లిపోతుంటే.. పోలీసులే వారిని అడ్డుకుంటున్నారు. గుంటూరులో నిన్న జరిగిన సామాజిక సాధికార బస్సుయాత్రలో జనంలేని దృశ్యాలు .. ఖాళీ కుర్చీలను మీడియా ఫోటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తుంటే.. వారిని పోలీసులు అడ్డు కోవడం ఎంత దుర్మార్గం? గుంటూరులో రోడ్డు మొత్తం బ్లాక్ చేసి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేసి బస్సుయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వడం .. దగ్గరుండి కాపలా కాయడం ఎలాంటి చట్టమో వారే చెప్పాలి. రాష్ట్రంలో అధికారపక్షానికి ఒక చట్టం.. ప్రతిపక్షాలకు ఒక చట్టమన్నట్టు ముఖ్యమంత్రి నియంత్రత్వంగా వ్యవహరిస్తుంటే.. పోలీస్ వ్యవస్థ నిస్సిగ్గుగా ఆయనకు వత్తాసు పలుకుతోంది. తనని ఎవరూ ప్రశ్నించకూడదు.. తనకు ఎవరూ అడ్డుచెప్పకూడదనే నియంత్రత్వ ధోరణితో విర్రవీగిన నియంత హిట్లర్ కంటే దారుణంగా రాష్ట్రంలో జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. రాజ్యాంగ వ్యవస్థల్ని తన స్వార్థానికి విధ్వంసం చేస్తూ.. తనమాటే శాసనం అన్నట్లుగా జగన్ రెడ్డి పరిపాలన చేస్తుంటే, పోలీసులు ఆయనకు దాసోహమై పని చేస్తున్నారు.
దళితమంత్రులు.. దళిత ఎమ్మెల్యేలు జగన్ కాళ్ల దగ్గర దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి పదవులకోసం సొంతజాతిని బలిపెడుతున్నారు.
రాష్ట్రంలో సామాజిక సాధికార బస్సుయాత్ర ప్రారంభానికి ముందు వైసీపీనేతలు రేపల్లెలో నిర్దాక్షణ్యంగా...అత్యంత అమానుషంగా బీసీ వర్గానికి చెందిన బాలుడు అమర్నాథ్ గౌడ్ ను పెట్రోల్ పోసి తగలబెట్టారు. నిన్నటికి నిన్న కంచికచర్లలో కాండ్రు శ్యామ్ కుమార్ అనే దళితయువకుడిని హరీశ్ రెడ్డి దారుణంగా కొట్టి.. హింసించి జాతీయ రహదారిపై గంటలపాటు తిప్పి.. చివరకు దాహం వేస్తుందని బాధితుడు అంటే అతని ముఖాన మూత్రం పోసి, అతన్నికులంపేరుతో దూషించారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరులో దళితనేత చిత్రహింసలకు గురి చేశారు. టీడీపీ ఎస్సీ సెల్ నేత ముల్లంగి వెంకటరమణను కల్లూరు సీఐ కత్తి శ్రీనివా సులు అక్రమంగా నిర్బంధించి చేతులు వెనక్కికట్టి నోట్లో గుడ్డలు కుక్కి చిత్రహింసలు పెట్టడం జరిగింది. కంచికచర్లలో దళిత యువకుడిపై దాడిచేసి.. మూత్రంపోసిన వారిపై పోలీసులు బెయిలబుల్ సెక్షన్లు పెట్టి..తూతూమంత్రంగా అరెస్ట్ చూపించారు. రేపో ..ఎల్లుండో నిందితుల్ని పోలీసులే వదిలేస్తారు. దళితులు.. ఇతర వర్గాలు ఎవరికీ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. వైసీపీప్రభుత్వం ఎస్సీ కమిషన్ ఛైర్మన్ గా నియమించిన విక్టర్ ప్రసాదే ఈ ప్రభుత్వంలో తనకు రక్షణలేదని వాపో యాడు. దళిత మంత్రులు.. అధికారపార్టీ దళిత ఎమ్మెల్యేలు జగన్ కాళ్లదగ్గర దళితుల ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టి పదవులకోసం సొంతజాతిని బలిపెడుతున్నారు.
రెడ్ల మధ్యలో నేలపై కూర్చోవడానికి నారాయణస్వామికి సిగ్గులేకపోయినా..దళితజాతి సిగ్గుపడదా? మంత్రి విశ్వరూప్ ముఖ్యమంత్రి ఎదుటే మోకాళ్లపై కూర్చొని దళితుల్ని అవమానించారు. జీవోనెం-1 తో ప్రతిపక్షాల గొంతు నొక్కడం.. జీవో నెం-2430 తో మీడియా స్వేఛ్చను హరించడం ఈ ముఖ్యమంత్రి నియంత్రత్వ పాలనలో పరాకాష్ట్ అని చెప్పక తప్పదు. జగన్ రెడ్డి.. అతని ప్రభుత్వం టీడీపీనేతలపై పెడుతున్న అక్రమ కేసులు మొత్తం భవిష్యత్ లో అతన్నే దహిస్తాయి. న్యాయవ్యవస్థలోని లోపాలను అడ్డుపెట్టుకొని.. తనపై ఉన్న అవినీతికేసుల విచారణకు కోర్టుల్లో హాజరుకాకుండా జగన్ రెడ్డి పదేళ్లుగా బెయిల్ పై బయట తిరుగుతూ... టీడీపీ అధినేత చంద్రబాబు..ఆ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టిస్తూ ఆనందిస్తున్నాడు. మంత్రులేమో అవినీతి.. దోపిడీకోసం ముఖ్యమంత్రి చేసేదానికి చెప్పేదానికి తలాడిస్తూ బానిసత్వం చేస్తున్నారు. ఉపముఖ్య మంత్రికి కూర్చోవడానికి కుర్చీలేకుండా చేయడం దళితజాతిని అవమానించడం కాదా? రెడ్లమధ్యలో నేలపై కూర్చోవడానికి నారాయణస్వామికి సిగ్గులేక పోయినా..దళితజాతి సిగ్గుపడదా? మంత్రి విశ్వరూప్ ఒక సందర్భంలో మోకాళ్లపై కూర్చొని దళితుల్ని అవమానించారు. ఇలాంటి సిగ్గులేని పనులతో సాధికారత సాధించామని సిగ్గులేకుండా ప్రజల్లోకి వెళ్ల ఎలా చెబుతారు? సామాజిక సాధికార బస్సుయాత్రలో వైసీపీనేతలు..మంత్రులు ఖాళీ కుర్చీలకు ఉపన్యాసాలిస్తుంటే.. పోలీసులు ఆ కుర్చీలకు కాపలా కాస్తున్నారు. జగన్ రెడ్డి అతని ప్రభుత్వంలో రోజుకో కుంభకోణం బయటకు వస్తోంది. వాటిపై ప్రశ్నిస్తున్నారనే టీడీపీనేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. ముఖ్యమంత్రి.. పోలీసుల బెదిరింపులు తప్పుడుకేసులతో టీడీపీనేతల ఆత్మస్థైర్యం ఎంతమాత్రం తగ్గదు. జగన్ రెడ్డికి తొత్తులుగా మారి పనిచేస్తూ, అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న కొందరు పోలీసులు ఏదో ఒకరోజు ఇప్పుడు చేసే ప్రతిదానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. చంద్రబాబు 53 రోజులు జైల్లో ఉంటే టీడీపీ నిరసనకార్యక్రమాలు నిరంతరం జరిగాయి. ఆ సందర్భంలో పోలీసులు టీడీపీ నేతలు..కార్యకర్తలపై వందలాది తప్పుడు కేసులు పెట్టారు.. అవేవీ నిలబడవని తెలిసీ పోలీసులు ఎందుకు అలా చేస్తున్నారో.. ఎవరి ఆనందం కోసమో తమకు తాము కోరి కష్టాలు ఎందుకు కొని తెచ్చుకుంటున్నారో వారే ఆలోచించుకోవాలి.” అని ఆనంద్ బాబు హితవు పలికారు.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.