వైసిపి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది
మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం : వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయింది అని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని 18వ వార్డులో "బాబు షూరిటీ- భవిష్యత్తు గ్యారంటీ" కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ యోగ క్షేమ సమాచారం తెలుసుకొని భవిష్యత్తు మీద భరోసా కల్పించారు. కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ 73 ఏళ్ల వయసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఆక్రమంగా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారని ఒక కేసులో కూడా ఇప్పటికి కనీసం ప్రాథమిక సాక్షాదారాలను కోర్టుకి సబ్మిట్ చేయలేకపోయారని దీన్నిబట్టి ఇది అక్రమ కేసు అని నిర్ధారణ అయిందని అన్నారు. హైకోర్టు కూడా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిందని ఇంతటి దుర్మార్గం, అరాచకం, అన్యాయాలను ప్రజలందరూ గమనిస్తున్నారని త్వరలోనే వీరికి బుద్ధి చెప్పటం ఖాయం అని తెలియజేశారు.
వైసిపి నాయకులు మార్కాపురం లో తెలుగుదేశం నాయకులను, ప్రజలను ఫోన్ చేసి బెదిరిస్తున్నారని వీరి తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడ వద్దని నిర్భయంగా తమ దృష్టికి తేవాలని పిలుపునిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మార్కాపురం లో ఒక కుటుంబం కూడా వైసిపికి ఓటు వేయొద్దని ఒకవేళ ఓటు వేస్తే వైసిపి నాయకుల అన్యాయాలను అరాచకాలను ఆక్రమణలను సమర్ధించినట్టేనని ప్రజలకు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున, తాళ్ళపల్లి సత్యనారాయణ, మౌలాలి ,కొప్పుల శ్రీనివాస్, గఫార్ ,మస్తాన్, పఠాన్ ఇబ్రహీం ,ఖాన్ ,షాకీర్, 18 వ వార్డు తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమం దిగ్విజయం చేశారు.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.