మంచి చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా
బి సి వై పి ఎమ్మెల్యే అభ్యర్థి రైతుబిడ్డ రావెల్ల భాగ్యలక్ష్మి
మార్కాపురం:మంచి చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని భారత చైతన్య యువజన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రైతుబిడ్డ రావెల్ల భాగ్యలక్ష్మి తెలిపారు. పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు బి సి వై పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రైతుబిడ్డ రావెళ్ల భాగ్యలక్ష్మి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ వ్యామోహంతో రాజకీయాలలోకి రాలేదని, రైతులకు, నియోజకవర్గంలోని ప్రజలకు అండదండగా ఉండేందుకే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. బీసీవై పార్టీ తరఫున నాకు ఈ అవకాశాన్ని కల్పించిన బోడె రామచంద్ర యాదవ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. వివిధ పార్టీల నాయకులు ప్రజా వేదికలపై ప్రగల్బాలు పలకడమే తప్ప ప్రజలకు మంచి చేసే యోచనలో ఏ పార్టీ నాయకులు కనిపించలేదని అన్నారు. పశ్చిమ ప్రాంతంలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి ఉండి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోయారని ఆమె ఎద్దేవా చేశారు. వెలుగొండ ప్రాజెక్ట్ పనులు పూర్తికాకుండానే వారి ఖాతాలో వేసుకునేందుకు నాయకులు జాతికి అంకితం చేశారని, వెలుగొండ ముంపు గ్రామాల ప్రజలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు అందించకుండా మోసపూరితమైన మాటలు చెప్పి మళ్ళీ ఓట్లు వేయమని అడగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ చేసిన మంచి పనులను చూసి చెరకు గుర్తుకు ఓటు వేసి బీసీవై పార్టీకి చేయూతనిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని అన్నారు. రాష్ట్రంలో 36 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత బోడె రామచంద్ర యాదవ్ కు దక్కుతుందని ఆమె అన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు, యువతకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ రైతన్న రాజ్యంగా తీర్చిదిద్దు తామని ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గం లోని సమస్యలను వెలికి తీసి ప్రజాసేవకే అంకితం అవుతామని రైతు బిడ్డ భాగ్యలక్ష్మి అన్నారు. త్వరలోనే నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో బీసీవై జిల్లా సమన్వయ సారధి పులిమి ఆత్మ రాములు, బత్తుల కాటంరాజు మేకల పెద్దిరాజు, విజయ వర్ధన్ యాదవ్, నక్క నాసర్ యాదవ్, బత్తుల రోశయ్య యాదవ్, ధనంకుల వెంకటేశ్వర్లు యాదవ్, పిట్టమల్ల నాగరాజు, రాజేశ్వరి, భత్తల బాల గురవయ్య, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.