ఆషాడ పూర్ణిమా వ్యాస పూర్ణిమ

నేడు గురుపూర్ణిమ

On
ఆషాడ పూర్ణిమా వ్యాస పూర్ణిమ

 *శ్లో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః*

*తా|| సాక్షాత్ విష్ణు స్వరూపుడు, జ్ఞాననిధి, వసిష్ఠ వంశోద్భవుడైన వేదవ్యాసునికి నమస్కారం*

*ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస భ‌గ‌వానుడు జ‌న్మించిన రోజు. ప్రతి సంవత్సరం ఆ రోజును "గురు పౌర్ణిమ" లేదా "వ్యాస‌ పూర్ణిమ" గా పాటిస్తారు. వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు.*

       పరమపావనమైన ఆషాఢ పూర్ణిమ ఆధ్యాత్మిక సాధనకి చాలా యోగ్యమైనది. అందునా ఈ ఆషాఢ పూర్ణిమకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది గురు పూర్ణిమ అని ప్రసిద్ధి. ఇక్కడి నుంచి చాతుర్మాసాలలో వచ్చే పూర్ణిమలు అన్నీ కూడాను జ్ఞాన ప్రధానమైనటువంటి పూర్ణిమలు. జ్ఞానము అనగానే ఆధ్యాత్మ జ్ఞానమే జ్ఞానము. సృష్టిలో విద్యలు ఎన్నైనా ఉండవచ్చు గాక. కానీ "ఆధ్యాత్మ విద్యా విద్యానాం” అని భగవద్గీతలో చెప్పినట్లుగా విద్యలన్నింటిలోకి ఆధ్యాత్మ విద్య చాలా గొప్పది. మిగిలినవన్నీ భౌతికామైన సుఖదుఃఖాలకు మాత్రమే పరిమితి ఉంటాయి. జీవుడిని తరింప జేసే విద్య ఆధ్యాత్మ విద్య. అందుకే ఆధ్యాత్మ ఎవరు బోధిస్తారో అతనిని సద్గురువుగా భావన చేసి ఆరాధించాలి. అసలు ఒక్క అక్షరం నేర్పిన వాడినైనా గురువుగా గౌరవించవలసిందే అని శాస్త్రం మనకి చెప్తున్నది. అందుకు విద్యలు పరా విద్యలు, అపరా విద్యలు అని రెండు విధములుగా చెప్పబడుతూ ఉంటాయి. అపరా విద్యలు అంటే లౌకికమైన విద్యలు అన్నీ కూడా అందులో వస్తాయి. పరావిద్య అంటే బ్రహ్మవిద్య, మోక్షానికి పనికివచ్చే ఆధ్యాత్మ విద్య. ఈ రెండు విద్యలు చెప్పేవాళ్ళు గురువులే. ప్రతి వారినీ గౌరవించాలి. అందునా పరావిద్యను చెప్పిన వారిని భగవంతునితో సమానంగా ఆరాధించుకోవాలి.

ఏ వ్య‌క్తికైనా మొద‌టి గురువు త‌ల్లే. ఆ త‌ర్వాత‌ మనకి జ్ఞానాన్ని అందించి ఏది మంచో, ఏది చెడో చెప్పే వారు గురువులు. అలాంటి గురువులని పూజించడం కోసం నిర్ణయించిన తిథి గురు పౌర్ణిమ‌. *"గు" అంటే అంధ‌కారం లేదా అజ్ఞానాన్ని, "రు" అంటే నిరోధించుట లేక నశింప చేయుట అని అర్థం. అంటే "గురువు" అనే ప‌దానికి అజ్ఞానాన్నినశింప చేయువారు అని అర్థం స్ఫురిస్తుంది.*

*_ఆది గురువు వ్యాసుడే_*

అప్ప‌టి వ‌ర‌కూ మౌఖికంగా ఒక‌రి నుంచి ఒక‌రికి సాగిన వేద‌జ్ఞానాన్ని అంత‌టినీ ఒక్క‌చోట‌కు చేర్చి నాలుగు విభాగాలుగా విభ‌జించి వేద వాగ్మ‌యాల‌ను సామాన్యుడి చెంత‌కు చేరేలా చేయ‌డంలో వ్యాసుడు ఎంతో కృషి చేశాడు. పంచ‌మ వేదంగా పేరు తెచ్చుకున్న మ‌హా భారతాన్ని మ‌న‌కు అందించిన వ్యాస భ‌గ‌వానుడు.

*_వేదాల‌ను గ్రంద‌స్థం చేసిన వ్యాస మ‌హ‌ర్షి_*

భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేకస్థానం ఉంది. యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి. గురుసంప్రదాయంలో శివుడే ఆదిగురువు. పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి ఢమరుకం నుంచి నాదం (శబ్దం) పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని శ్రీ మహా విష్ణువు బ్రహ్మదేవునకు ఉపదేశించాడు. (శివ కేశవులకు బేధం లేదు, ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క భిన్న కోణాలు). బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మ దేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి, ఆయన తన కూమరుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు.

వ్యాసమహర్షి ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు. ప్రతి ద్వాపర యుగములోను ఒక సారి వ్యాసుడు ఉద్భవిస్తాడు. 

ప్రస్తుతం మనం ఉంటున్నది వైవస్వత మన్వంతరంలో ని 28వ యుగంలోని వ్యాసుడు *కృష్ణద్వైపాయనుడు* కాలంలో.

ఇంతవరకు వ్యాసపీఠాన్నధిరోహించిన వ్యాసులు పేర్లు:

1. స్వాయంభువ 
2. ప్రజాపతి
3. ఉశన 
4. బృహశ్పతి 
5. సవిత 
6. మృత్యువు 
7. ఇంద్ర 
8. వశిష్ఠ 
9. సారస్వత 
10. త్రిధామ 
11. త్రివృష 
12. భరద్వాజ 
13. అంతరిక్షక 
14. ధర్ముడు 
15. త్రయారుణ 
16. ధనుంజయుడు 
17. కృతంజయుడు 
18. సంజయ 
19. భరద్వాజ 
20 గౌతమ 
21. ఉత్తముడు 
22. వాజశ్రవ 
23. సోమశుష్మాయణ 
24. ఋక్షుడు 
25 శక్తి 
26. పరాశరుడు 
27. జాతూకర్ణి 
28. ప్రస్తుతం వేదవ్యాసుని పేరు కృష్ణద్వైపాయనుడు.

ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయింది, అనేక మంది ఈ మహాజ్ఞానం ఉపదేశించబడదింది. కానీ అప్పటివరకు వేదం ఎప్పుడు గ్రంధస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు (అందుకే వేదానికి 'శ్రుతి' అని పేరు). మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది. కానీ కలియుగంలో మనుష్యులయొక్క ఆయుషును (జీవిత కాలాన్ని), బుద్ధిని, జ్ఞాపకశక్తిని దృష్టిలో ఉంచుకుని, కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వేదవ్యాసుడిగా పేరుగాంచారు. ఈయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంధస్థం చేశారు.


వేదాలను నాలుగుభాగాలుగా విభజించి పైలుడనే శిష్యుడికి ఋగ్వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమిని అనే శిష్యుడికి సామవేదాన్ని, సుమంతుడనే శిష్యుడికి అధర్వణవేదాన్ని తెలిపి వాటిని వ్యాప్తిచేయమని ఆదేశించాడు. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలనందించినవారే వ్యాసులవారు.

*_వేద వ్యాసుని ఇతి వృత్తం_*

వసిష్ఠమహామునికి మునిమనుమడు, శక్తి మహామునికి మనుమడు, పరాశరమునికి పుత్రుడు, శుకమర్షికి జనకుడైనట్టియు, నిర్మలుడైనట్టి, తపవు అనే ధనరాశి గలిగిన శ్రీ వ్యాసులవారికి నమస్కారము.

శ్రీహరి అంశతో సత్యవతీ, పరాశరునికి జన్మించిన వాడే వ్యాసుడు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై దృతరాష్టుని, అంబాలికకు పాండు రాజుని, అంబిక దాసికి విదురుని ప్రసాదించినాడు. పాండవ అగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే. దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశ స్త్రాల్రు పొందాడు. కురుపాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా జ‌యం అనే పేరిట గ్రంథస్థం చేశాడు వ్యాసుడు. అదే ఆ త‌ర్వాతి కాలంలో మహా భారతమైంది. అష్టాదశ పురాణాలు వ్రాసింది వ్యాసుడే. ఇంకా భాగవాతాన్ని రచించాడు.

*_వ్యాస పౌర్ణిమ రోజు పూజా విధానం_*

కొత్త అంగవస్త్రం మీద (భూమి మీద పరచి) బియ్యం పోస్తారు. ఆ బియ్యంపైన నిమ్మ కాయలు ఉంచు తారు. శంకరులు, అత ని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్ళి పిడికిడు చొప్పున తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపు తార‌ట. బియ్యం, కొత్త వస్త్రం లక్ష్మీ చిహ్నం. నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన. బియ్యం, నిమ్మపళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. దక్షిణాదిన కుంభ కోణంలో, శృంగేరీలో శంకర మఠాలలో వ్యాసపూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు.

అయితే ఈ రోజున దేశంలోని సన్యాసులంతా వ్యాసుని రూపంలో వున్న తమ గురువుని కొలుస్తున్నారని పండితులు చెబుతారు! వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమనాడు విష్ణులోకం పొందుతారుట. వ్యాసుడు సకల కళా నిధి, సకల శాస్త్రవేత్త, శస్త్ర చికిత్సవేది, మేధానిధి, వైద్యవరుడు, ఆత్మవిద్యానిధి, వైద్య విద్యానిధి. ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలి.

హిందూ సంప్ర‌దాయాలు పాటించే భార‌త‌దేశం, నేపాల్, ఇంకా బుద్ధ‌, జైన సంప్ర‌దాయాలు పాటించే చోట్ల గురు పౌర్ణిమ‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ఈ రోజున ప్ర‌జ‌లు త‌మ ఆధ్యాత్మిక గురువుల‌ను స్మ‌రిస్తారు. పూజిస్తారు. బ‌హుమ‌తులు ఇస్తారు.గుడికి వెళ్లి ప్రార్థిస్తారు, దేవుళ్ల నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు. దేవుడిపై త‌మ‌కున్న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచేందుకు చేసే మ‌రో మార్గం ఉప‌వాసం ఉండ‌టం, గురువును పూజించి తాము మ‌రింత కాలం జీవించేందుకు మార్గ‌ద‌ర్శ‌క‌త్వం తీసుకుంటారు.

దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు.

*_𝕝𝕝ॐ𝕝𝕝  oఓo శ్రీ గురుభ్యో నమః 𝕝𝕝卐𝕝𝕝_*

*_𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝𝕝_*

*_𝕝𝕝ॐ𝕝𝕝 వ్యాసపూర్ణిమా శుభాకాంక్షలు 𝕝𝕝卐𝕝𝕝_*

*_𝕝𝕝 శుభమస్తు 𝕝𝕝_*

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

విషాదం లో లింగోజీపల్లి : బాలుడు మృతదేహం లభ్యం  విషాదం లో లింగోజీపల్లి : బాలుడు మృతదేహం లభ్యం 
ప్రకాశం జిల్లా: కంభం మండలం లింగోజిపల్లి లో అదృశ్యమైన చిన్నారి మృతదేహం లభ్యమైంది. మూడేళ్ల బాలుడు లక్షిత్ మృతదేహం సూరేపల్లి సమీపంలో లభ్యం కావడం తో చిన్నారి...
ఆషాడ పూర్ణిమా వ్యాస పూర్ణిమ
నేటి పంచాంగం:  *గురువారం, జూలై 10, 2025*
ఆటో బోల్తా పడి ఒకరు మృతి
నేటి పంచాంగం: *బుధవారం, జూలై 9, 2025*
నెలాఖరులోగా మార్కెట్ యార్డులు, దేవాలయ కమిటీలు భర్తీ : లోకేష్ 
అమెరికాలో హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం