Category
Local
Local 

అనాద బ్రాహ్మణుడికి అంతిమ సంస్కారం నిర్వహించిన బిజెపి నేత పీవీ కృష్ణారావు

అనాద బ్రాహ్మణుడికి అంతిమ సంస్కారం నిర్వహించిన బిజెపి నేత పీవీ కృష్ణారావు మార్కాపురం: నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి పీవీ కృష్ణారావు మానవత్వం చాటుకున్నారు. అనాద బ్రాహ్మణుడికి అంతిమ సంస్కారం నిర్వహించి ధర్మానికి అండగా నిలిచారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు నాలుగు రోజుల క్రితం దరిమడుగు గ్రామంలో హైవే రోడ్డు ప్రక్కన ఒక అనాధ వ్యక్తి చనిపోయాడు. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న మృతుని సోదరుడు మార్కాపురం చేరుకున్నాడు. పేదరికంలో ఉన్న బ్రాహ్మణ కుటుంబం అని, దహన సంస్కారాలు చేసే శక్తి లేదని అతను పోలీసులకు తెలుపగా, పోలీసులు బీజేపీ నాయకులు కృష్ణారావు కి సమాచారం ఇచ్చారు. ఆదివారం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం పోలీసు వారి సూచన మేరకు ఆ శవాన్ని మార్కాపురం జిల్లా వైద్యశాల నుండి తీసుకుని హిందూ స్మశాన వాటికకు తీసుకొని వచ్చి దహన సంస్కారాలను బీజేపీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణారావు తో పాటుగా బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు చలువాది మురళి, ఎస్సీ సెల్ నాయకులు లింగాల నాగరాజు పాల్గొన్నారు.
Read More...
Local 

చలివేంద్రం లో మజ్జిగ పంపిణీ ప్రారంభించిన ఛైర్మన్ చిర్లంచర్ల 

చలివేంద్రం లో మజ్జిగ పంపిణీ ప్రారంభించిన ఛైర్మన్ చిర్లంచర్ల  మార్కాపురం: పట్టణం లోని నెహ్రూ బజార్ శ్రీ షిర్డీ సాయి బాబా మందిరం ఆధ్వర్యంలో కంభం రోడ్ నందు చలివేంద్రం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.‌ 24 వ తేది గురువారం చలివేంద్రం లో మజ్జిగ వితరణ జరిగినది. ఈ సేవా కార్యక్రమం ను మార్కాపురం మునిసిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాల మురళి కృష్ణ, వైస్ చైర్మన్ చాతరాజపల్లి శ్రీనివాసులు ప్రారంభించారు. మందిరం అధ్యక్షులు పేరం సత్యనారాయణ, కార్యదర్శి గోపాలుని హరిహర రావు, సహా కార్యదర్శి షేక్ కరీం బాషా, కమిటీ సభ్యులు సురే నాగేశ్వర రావు, విజయ్, అలవాలా సుబ్బా రావు, దూళిపాళ మధు తదితరులు పాల్గొన్నారు.
Read More...
Local 

ఉపాధి హామీ పనులను పరిశీలించిన సబ్ కలెక్టర్ 

ఉపాధి హామీ పనులను పరిశీలించిన సబ్ కలెక్టర్  మార్కాపురం : వలస కూలీలను నివారించడమే ప్రభుత్వ లక్ష్యమని సబ్ కలెక్టర్ త్రివినాగ్ తెలిపారు. మండలంలోని దరిమడుగు గ్రామ పరిధిలో జాతీయ ఉపాధి హామీ పథకం లో వెలుగొండ ప్రాజెక్టు కలనూతల గ్రామ పునరావాస కాలనీ ఇడుపూరు 1 వద్ద గల ప్రాజెక్టు కాలువ లో కూలీలు  పిచ్చి చెట్ల తొలగింపు చేస్తున్న పనులను గురువారం ఉదయం పరిశీలించారు.   పని ప్రదేశంలో  కూలీలతో పాటు కొంత సమయం గొడ్డలితో పిచ్చి చెట్ల తొలగింపు పనులు, గడ్డపారతో మట్టిని తవ్వడం, పారతో మట్టి ఎత్తుకొని కాలువ కట్టపై పోయడం వంటి పనులను చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు.  పని ప్రదేశంలో తాగునీటి సౌకర్యం, నీడ వసతి, ప్రాథమిక చికిత్స వంటి సదుపాయాలు చేస్తున్నారా అని వారిని అడిగారు. ప్రతిరోజు చేస్తున్న పనికి తగ్గ వేతనం వస్తుందా లేదా  అని ఆరా తీశారు. రోజువారి కూలీ ఎంత మేర వస్తుందని అడిగి తెలుసుకున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల విషయంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులకు తెలియజేసి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు జవ్వాజి రామానుజుల రెడ్డి, ఏపీవో నాగరాజు, ఈసీ కిషోర్ కుమార్, టి ఏ లు  కాశీ , శివారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ దూదేకుల కాసిం , జవ్వాజి మల్లికార్జున్ రెడ్డి , అశోక్ రెడ్డి, తురక వెంకటేశ్వర్లు, సుబ్బారావు లు  పాల్గొన్నారు.
Read More...
Local 

ఉగ్రవాదం పై ఉక్కుపాదం మోపండి. : బీజేపీ నేత ఉదయ శంకర్ 

ఉగ్రవాదం పై ఉక్కుపాదం మోపండి. : బీజేపీ నేత ఉదయ శంకర్  గిద్దలూరు: జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన విషాద సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బీజేపీ పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ శంకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి ఆత్మలకు శాశ్వత శాంతి చేకూరాలని ప్రార్థిస్తు, ఇలాంటివి ముందు ముందుగా జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదులను ఏ ఒక్కరిని వదలకుండా కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని  కోరారు.
Read More...
Local 

ఒంగోలులో హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన  హోంమంత్రి వంగలపూడి అనిత

ఒంగోలులో హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన  హోంమంత్రి వంగలపూడి అనిత ఒంగోలులో హత్య జరిగిన ప్రాంతాన్ని  హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. హత్య కేసులోని నిందితులు ఎంతటి వారైనా కఠిన శిక్ష తప్పదని హెచ్చరించిన రాష్ట్ర హోమంత్రి అనిత. ఒంగోలులోని పద్మ టవర్స్ దగ్గర మంగళవారం రాత్రి సుమారు 07.35 గంటలకు హత్య జరిగిన నేర స్థలమునకు ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మాత్యులు శ్రీమతి వంగలపూడి. అనిత స్వయంగా వెళ్లి, నేర స్థలమును క్షుణ్ణంగా పరిశీలించారు. పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర హోమంత్రి మాట్లాడుతూ టీడీపీ మాజీ MPP నేత ముప్పవరపు వీరయ్య చౌదరిని అతి దారుణంగా కిరాతకంగా చంపటం చాలా దురదృష్టకరమైన బాధాకరమైన విషయమన్నారు. మంచి పేరు ఉన్న వ్యక్తి అని ఎటువంటి కారణాలతో చంపడం జరిగిందో కాని, సంఘటన జరిగిన ప్రదేశానికి జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్  వెనువెంటనే చేరుకున్నారని, 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయటం ప్రతి బృందానికి ఒక డిఎస్పీ స్ధాయి అధికారులను నియమించటం జరిగిందని, అన్ని కోణాల్లో దర్యాప్తు, సాంకేతికతను ఉపయోగించి ముద్దాయిలను పట్టుకుని చట్ట ప్రకారం శిక్ష పడే విధంగా చేస్తామన్నారు. వీరయ్య చౌదరి మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను పట్టుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర హోమంత్రి వెంట ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఐ.పి.యస్., మ్యారిటైంబోర్డ్  చైర్మన్ దామచర్ల సత్య, ఒంగోలు డిఎస్పీ శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు మరియు తదితరులు ఉన్నారు.
Read More...
Cultural  Local 

హనుమంతుని వాహన సేవలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా కుటుంబం

హనుమంతుని వాహన సేవలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా కుటుంబం మార్కాపురం: మార్కాపురం ఇల వేల్పు శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం ఉదయం హనుమంతుని వాహన సేవ నిర్వహించారు. ఈ సేవ లో గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం వైఎస్సార్సీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు ధర్మపత్ని దుర్గా కుమారి , తనయుడు అన్నా కృష్ణ చైతన్య  ధర్మపత్ని  అనూష, కుమార్తె సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
Read More...
Cultural  Local 

పొన్న వాహనం పై విహరించిన చెన్నకేశవ స్వామి 

పొన్న వాహనం పై విహరించిన చెన్నకేశవ స్వామి  మార్కాపురం: పట్టణంలోని  శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారు పొన్న వాహనంపై నుంచి మురళీ కృష్ణుని అలంకరణ లో భక్తులను అనుగ్రహించారు. పొన్న వృక్షమంటే కల్పవృక్షమని అర్థం.కల్పవృక్షం పై నుంచి స్వామివారిని దర్శించుకొని భక్తులు తరించారు. సకల కోరికలను తీర్చు కల్పవృక్షం శక్తి సామర్థ్యాలను భగవానుడు అనుగ్రహించడం పొన్నవాహనసేవలో అనుగ్రహించడం ఎంతో ప్రీతికరమైందని,ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు తెలిపారు. ఉభయదారులు గా వేముల సుబ్బారావు దంపతులు,వేముల ప్రసాద్ దంపతులు వ్యవహరించారు. కార్యక్రమాలు కమిటీ అధ్యక్షులు యక్కలి కాశీ విశ్వనాధం, సభ్యులు ఆలంపల్లి శ్రీనివాస్, బొంతల సుధీర్,ఈఓ గొలమారు శ్రీనివాసరెడ్డి ల పర్యవేక్షణ లో జరిగాయి.
Read More...
Local 

వక్కలగడ్డ నాయకత్వంలో కనిగిరి కి తరలి వెళ్ళిన ఆర్యవైశ్యులు

వక్కలగడ్డ నాయకత్వంలో కనిగిరి కి తరలి వెళ్ళిన ఆర్యవైశ్యులు మార్కాపురం: ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసువులు బాసిన స్వర్గీయ పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మార్కాపురం ఆర్యవైశ్య నాయకులు, వక్కలగడ్డ మల్లికార్జున నేతృత్వంలో బుధవారం కనిగిరి కి బయలుదేరి వెళ్లారు. ముందుగా పట్టణంలోని అమ్మవారి శాలలో వాసవి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, పొట్టి శ్రీరాములు గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు వాహనాల్లో కనిగిరి కి బయలుదేరి వెళ్లారు. కనిగిరి లో నేడు ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వర్గీయ పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం నాయకులు తాళ్ళపల్లి సత్యనారాయణ, ఆలంపల్లి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
Read More...
Local 

ఐటిడిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

ఐటిడిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి మార్కాపురం: ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డవెలిప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మార్కాపురం మండలం, బి.పి.నాగులవరం చెంచుగూడెం లో సంస్థ కార్యదర్శి అనుముల రవికుమార్ అధ్యక్షతన డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా చెంచు గిరిజనులకు లడ్లు,మిఠాయిలు పంచిపెట్టారు,ఈ కార్యక్రమంలో కృష్ణ కుమారి మరియు చెంచు పెద్దలు పాల్గొని భారత దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు.
Read More...
Local 

పుర్రె తో క్షుద్ర పూజలు.. భయాందోళన లో ప్రజలు

పుర్రె తో క్షుద్ర పూజలు.. భయాందోళన లో ప్రజలు ప్రకాశం జిల్లా:  గిద్దలూరు మండలం కొండపేట సమీపంలో సోమవారం క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు నిమ్మకాయలు, ముగ్గు, పసుపు కుంకుమతో పాటు మనిషి పుర్రెను పెట్టి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షుద్ర పూజలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read More...
Local  State 

ఈనెల 16 న ‌కనిగిరి లో శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు 

ఈనెల 16 న ‌కనిగిరి లో శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు  ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుండడం పట్ల వైశ్య సంఘాల హర్షం ఇది తెలుగు వారందరి కార్యక్రమం.. వక్కలగడ్డ మల్లికార్జున 
Read More...
Local 

ఒకే వేదిక పైన మాజీ ఎమ్మెల్యే... ఎమ్మెల్యే

ఒకే వేదిక పైన మాజీ ఎమ్మెల్యే... ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా : రాచర్ల మండలం జెపి చెరువు సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం కావడంతో భక్తులు 20వేల మందికి పైగా తరలివచ్చారు. ఒకే వేదికపై కళ్యాణ మహోత్సవంలో ప్రస్తుత ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు ప్రజలకు కనిపించారు. స్వామివారికి ఇరువురు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇది చూసిన జనం సంతోషంగా మురిసిపోయారు.
Read More...