Category
State
State 

రాజేశ్వరి వృద్ధాశ్రమంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

రాజేశ్వరి వృద్ధాశ్రమంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు హైదరాబాద్: భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రముఖ ఔషధ తయారీ సంస్థ లీ ఫార్మా సహకారంతో ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలోని రాజేశ్వరి వృద్ధాశ్రమంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి గారు వృద్ధులకు ఉచితంగా అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏలూరి మాట్లాడుతూ.. “చంటి పిల్లల నుండి పండు ముసలి వరకు అందరికీ సంక్షేమ పథకాలను అందించిన గొప్పనేత శ్రీ నరేంద్ర మోదీ గారు. ఆయన ఆర్థిక సంస్కరణలు భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా నిలబెట్టాయి. మోదీ జీవితం మనందరికీ ఆదర్శం. దేశం కోసం ఆయన చేసిన త్యాగం భరతమాతకే గర్వకారణం. మోదీ గారి ముందుచూపు వల్లే ఆపరేషన్ సింధూరం వంటి సైనిక యుద్ధాల్లో ఘన విజయాన్ని సాధించగలిగాము. అదే ముందుచూపుతో కరోనా సమయంలో ప్రపంచానికి భారతదేశమే ఔషధాలను సరఫరా చేసింది” అని అన్నారు.  ఆయన పుట్టినరోజును ఆడంబరాలకు కాకుండా, ప్రజా సేవకు అంకితం చేస్తున్నారు. మహిళలు, పిల్లల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కు శ్రీకారం చుట్టారని.. అంతటి గొప్పనేత మనకు ప్రధానిగా ఉండటం మన అదృష్టం అన్నారు ఏలూరి.. కాగా ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకులతోపాటుగా ఐస్‌క్రీం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read More...
Local  State 

పైశాచిక భర్త చేతిలో గాయపడ్డ బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్యే కందుల

పైశాచిక భర్త చేతిలో గాయపడ్డ బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్యే కందుల తర్లుపాడు:  మండలం లోని కలజువ్వలపాడు గ్రామం లో మానవత్వం సిగ్గుపడే రీతిలో ఓ భర్త కట్టుకున్న భార్యపై కిరాతకంగా ప్రవర్తించాడు. తర్లుపాడు మండలం కలుజ్వాలపాడు గ్రామంలో జి. భాగ్యలక్ష్మి అనే మహిళను ఆమె భర్త జి. బాలాజీ, తన అక్కతో కలిసి చిత్రహింసలకు గురిచేశాడు. బాధితురాలి రెండు చేతులను కట్టేసి, బెల్టు తో విచక్షణారహితంగా కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. ఈ అమానవీయ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.భాగ్యలక్ష్మిని పోలీస్ సిబ్బంది, స్థానికులు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తక్షణమే ఆసుపత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు.ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ సందర్భంగా ఆయన భాగ్యలక్ష్మి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.తక్షణ సహాయం కింద వారికి ఆర్థిక సాయాన్ని అందజేశారు.ఈ దారుణానికి ఒడిగట్టిన భర్త బాలాజీ, అతనికి సహకరించిన వారిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కందుల నారాయణరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. మహిళలపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు.
Read More...
Local  State 

భార్యపై భర్త అమానుష దాడి - ప్రకాశం పోలీస్ సీరియస్ యాక్షన్

భార్యపై భర్త అమానుష దాడి - ప్రకాశం పోలీస్ సీరియస్ యాక్షన్ కుటుంబ సభ్యుల కోసం గాలింపు ఘటన తెలిసిన వెంటనే రంగంలోకి పోలీస్ బాధిత మహిళను వైద్యశాలకు స్వయంగా తరలించిన పోలీస్  
Read More...
Stories  State 

PM Modi At 75: మన మోదీయే బాస్.. 

PM Modi At 75: మన మోదీయే బాస్..  భారత ప్రధానిపై ప్రపంచ నాయకుల ప్రశంసలు.. ఎవరేమన్నారంటే..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సెప్టెంబర్ 17, 2025తో 75వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రారంభించడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 75వ పుట్టినరోజును జరుపుకోనున్నారు.  
Read More...
State 

సింగరకొండ లో జాతీయ చిన్న పత్రికల కార్యవర్గ సమావేశం 

సింగరకొండ లో జాతీయ చిన్న పత్రికల కార్యవర్గ సమావేశం  అద్దంకి:  ప్రముఖ పుణ్యక్షేత్రం సింగరకొండలోని వేమారెడ్డి సత్రం కళ్యాణ మండపంలో శనివారం జాతీయ చిన్న మధ్యతరగతి పత్రికల అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ చిన్న పత్రికల సంఘం అధ్యక్షులు గుండ్లకమ్మ పత్రిక చైర్మన్ సంధి రెడ్డి కొండలరావు అధ్యక్షులు జరిగిన ఈ సమావేశంలో దేశంలోని పలు ప్రాంతాల నుండి చిన్న పత్రికల యాజమాన్యాలు తరలి వచ్చాయి. చిన్న పత్రికలకు గుర్తింపు అక్రిడేషన్ కార్డుల మంజూరు ప్రభుత్వ ప్రకటనలు తదితర అంశాలపై సమావేశంలో యూనియన్ నాయకులు చర్చించారు.
Read More...
State 

సి యం చంద్రబాబుకు కొత్త హెలికాప్టర్

సి యం చంద్రబాబుకు కొత్త హెలికాప్టర్ అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడు కోసం అధికారులు కొత్త హెలికాప్టర్ అందుబాటులోకి తెచ్చారు. చంద్రబాబు నాయుడు ఎయిర్ బస్ హెచ్-160 మోడల్ హెలికాప్టర్ ను ఎంచుకున్నారు.ఈ హెలికాప్టర్ అధునాతన ఫీచర్లతో ఉంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రయాణించేందుకు అనువుగా ఉంటుంది. హెలికాప్టర్ లో పైలట్ల తో పాటు ఆరుగురు ప్రయాణం చేయవచ్చు. రక్షణ పరంగానే కాకుండా ఇందులో చాలా ప్రత్యేక ఫీచర్లు సైతం ఉన్నాయి.నూతన హెలికాప్టర్ వల్ల సీఎం పర్యటనలు వేగవంతం అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.అయితే రెండు వారాలుగా హెలికాప్టర్ అందుబాటులోకి వచ్చినప్పటికీ విషయం మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఎం భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మాజీ దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ మరణం తర్వాత.. సీఎం పర్యటనలకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అందులో భాగంగానే పాత బెల్ స్థానంలో ఈ నూతన హెలికాప్టర్ అందుబాటులోకి తెచ్చారు.
Read More...
Local  State 

హైవేపై కారు దగ్ధం: మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది

హైవేపై కారు దగ్ధం: మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది ఒంగోలు : హైవేపై కారు దగ్ధమవడంతో పెను ప్రమాదం నుంచి ముగ్గురు తప్పించుకున్నారు.స్థానిక టోల్గేట్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం నెల్లూరు నుంచి ఒంగోలు వస్తున్న రెనాల్ట్ డస్టర్ ఏపి31బిజడ్1116 కారు  ఇంజన్ లో ఒక్కసారిగా మంటలు రావడంతో కారు దగ్ధమైంది. ఇంజన్లో మంటలు గమనించిన కారు యజమాని నరసింహారావు వెంటనే భార్య కుమారుడు కారు దిగి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న టంగుటూరి ఎస్ఐ నాగమల్లేశ్వరరావు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చి హైవేపై భారీ ప్రమాదం జరగకుండా నియంత్రణ చేపట్టారు. ఈ సంఘటనలో పలువురు పోలీసు, అగ్ని మాపక సిబ్బంది పాల్గొన్నారు.
Read More...
State 

156 మంది కి ఎంపీడీవోలు గా పదోన్నతి

156 మంది కి ఎంపీడీవోలు గా పదోన్నతి Amaravati: డిప్యూటీ ఎంపీడీవోలు, పరిపాలన అధికారులు 156 మందికి ఎంపీడీవోగా ప్రభుత్వం గురువారం పదోన్నతులు కల్పించింది. పంచాయతీరాజ్ శాఖలో ఒకేసారి భారీ సంఖ్యలో పదోన్నతులు కల్పించడం పదేళ్లలో ఇదే మొదటిసారి. ఈ ఉత్తర్వులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వీఆర్ కృష్ణ తేజ జారీ చేశారు. 94 మంది డిప్యూటీ ఎంపీడీవోలు, మండల పరిషత్, జిల్లా పరిషత్తు, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయాల్లోని పరిపాలన అధికారులు మరో 62 మంది ఎంపీడీవోలుగా పదోన్నతులు పొందిన వారిలో ఉన్నారు. పలువురు ఎంపీడీవోలకు డివిజినల్ డెవలప్మెంట్ అధికారులు (డీఎల్ డీవో)గా ఇటీవల పదోన్నతులు కల్పించిన విషయం తెలిసిందే. ఆ ఖాళీలను డిప్యూటీ ఎంపీడీవో, పరిపాలన అధి కారులకు పదోన్నతుల ద్వారా భర్తీ చేశారు.
Read More...
State 

ఈ నెల 7 న   శ్రీశైలం గుడి  మూసివేత

ఈ నెల 7 న   శ్రీశైలం గుడి  మూసివేత Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రం  శ్రీశైలంలోని  భ్రమరాంబిక మల్లికార్జున స్వామి   ఆలయ ద్వారాలను  ఈనెల 7వ తేదీ  మధ్యాహ్నం 1.00 గంట  నుంచి ఎనిమిదో తేదీ ఉదయం 5 గంటల వరకు మూసివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా 7 వ తేది న స్వామి స్పర్శ దర్శనం పూర్తిగా నిలుపుదల చేసినట్టు ఆయన తెలిపారు.  ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు, ఆదిదంపతుల కళ్యాణోత్సవం పూర్తిగా నిలిపివేశారు. ఆరోజున అలంకార దర్శనం మాత్రమే భక్తులందరికీ అవకాశం . సాక్షి గణపతి, హఠ కేశ్వరం, పాల ధార, పంచదార, శిఖ రేశ్వరం, తదితర  పరివారా ఆలయ ద్వారాలను కూడా మూసివేస్తారు.  సెప్టెంబర్ 8 న ఉదయం ఐదు గంటలకు  ఆలయ ద్వారాలను తెరిచి, ఆలయ శుద్ధి సంప్రోక్షణ  జరిపించిన తర్వాత  ప్రాతః కాలం పూజలు ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 7:30 గంటల నుంచి శ్రీ స్వామి అమ్మవార్ల కు మంగళ హారతులు జరిపిస్తారు.  మంగళ హారతుల సమయం నుంచి అనగా  ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 గంటల  వరకు స్వామి అలంకార దర్శనం కల్పిస్తారు. సెప్టెంబర్ 8 వ తేదీ నాటికి ఆన్ లైన్ లో   స్వామి స్పర్శ దర్శనం, , విరామ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు మధ్యాహ్నం 2.15 గంటల నుంచి  4 గంటల వరకు శ్రీ స్వామి స్పర్శ దర్శనం కల్పిస్తారు.  తిరిగి సాయంకాలం ఐదున్నర గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు  అలంకార దర్శనాలు కొనసాగుతాయి.
Read More...
State 

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్పార్క్

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్పార్క్ AP: క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ పెడుతున్నట్లు దిగ్గజ IT సంస్థ IBM ప్రకటించింది. 2026 మార్చి నాటికి దీనిని ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధి క్రౌడర్ ప్రకటించారు. క్వాంటమ్ కంప్యూటింగ్లో భారత్ బలమైన శక్తిగా ఎదుగుతుందని, భవిష్యత్తులో ఈ రంగంపై ఎక్కువ పరిశోధనలు చేయాలని ఆయన అన్నారు. ప్రస్తుతం USA, జపాన్, కెనడా, ద.కొరియాలో IBM క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్లు ఉన్నాయి.
Read More...
Local  State 

*RIECEE (NCERT) - 2025 కామన్ ఎంట్రన్స్ టెస్ట్  రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన దోర్నాల మండలం విద్యార్థిని కర్రా అంజన షణ్ముఖ ప్రియ.*

*RIECEE (NCERT) - 2025 కామన్ ఎంట్రన్స్ టెస్ట్  రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన దోర్నాల మండలం విద్యార్థిని కర్రా అంజన షణ్ముఖ ప్రియ.* Prakasam : July 2025 న ఇంటర్మీడియట్ అర్హతతో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, పీజీ ప్రవేశాల కోసం  దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్సీఈఆర్టీ వారు నిర్వహించే RIECEE కామన్ ఎంట్రన్స్ టెస్ట్  పరీక్ష ఫలితాలలో ప్రకాశం జిల్లా, దోర్నాల మండలం, రామచంద్ర కోట గ్రామం కి  చెందిన *కర్రా అంజన షణ్ముఖ ప్రియ* ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఫిజిక్స్, ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ మూడు విభాగాలలో కూడా స్టేట్ 1st ర్యాంకు మరియు ఇంటిగ్రేటెడ్ బీఈడీ ఫిజికల్ సైన్స్ state 2 వ ర్యాంక్, all india 24 వ rank,   మరియు ఇంటిగ్రేటెడ్ బిఈడి జనరల్ విభాగాలలో state 2 వ ర్యాంక్, all ఇండియా 25 rank   కైవసం చేసుకున్నారు. తమ విద్యార్థి ఐదు విభాగాలలో ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల  వసంతా జూనియర్ కళాశాల  యాజ మాన్యం, విద్యార్థి తల్లిదండ్రులు కర్రా వెంకట సుబ్బారెడ్డి  (గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లెక్చరర్), కర్రా మంగమ్మ (పిజిటి తెలుగు టీచర్) మరియు బంధుమిత్రులు   హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థి ఎటువంటి కోచింగ్ లేకుండానే  స్థానికంగానే   చదువుకుంటూ కళాశాల అధ్యాపకులు మరియు తమ తల్లిదండ్రుల మార్గ నిర్దేశాలతో  ఒకేసారి ఐదు విభాగాలలో  సీట్ సాధించగలిగలగడం గమనార్హం.
Read More...
Stories  State 

ఉపాధి సిబ్బందిపై శీతకన్ను – ఉద్యోగుల గోడు ఎవరికి పట్టదు?

ఉపాధి సిబ్బందిపై శీతకన్ను – ఉద్యోగుల గోడు ఎవరికి పట్టదు? తాడేపల్లి/అమరావతి: ఉపాధి హామీ పథకం కింద సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న వేలాది మంది సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మేము రాత్రింబగళ్లు కష్టపడి పని చేస్తే రాష్ట్రానికి ఏటా 5–6 వేల కోట్ల మెటీరియల్ సెంట్రల్ నుండి వస్తుంది. కానీ మాకు మాత్రం కనీస జీతం కూడా రావడం లేదు. సంక్షేమ పథకాలూ ఆగిపోయాయి. ఇది ఎంత అన్యాయం?” అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
Read More...